నరసింహ సీక్వెల్ పై సూపర్ స్టార్ రియాక్షన్!

ఈమధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఏ రేంజ్ లో అయితే కొనసాగుతోందో.. మరొకవైపు సీక్వెల్స్ హవా కూడా అంతే కొనసాగుతోంది అని చెప్పవచ్చు.;

Update: 2025-12-09 05:19 GMT

ఈమధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఏ రేంజ్ లో అయితే కొనసాగుతోందో.. మరొకవైపు సీక్వెల్స్ హవా కూడా అంతే కొనసాగుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు.. ఆ సినిమాకు కొనసాగింపుగా దాన్ని సీక్వెల్ ను తెరకెక్కిస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేస్తే.. మరికొన్ని సినిమాలకు ప్రీక్వెల్స్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇకపోతే ఈ మధ్యకాలంలో తీసిన చిత్రాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఒక ఎత్తైతే.. దాదాపు రెండు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రాలకు మళ్లీ ఇప్పుడు సీక్వెల్స్ ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా 1999లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని నటీనటులకు ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందించిన ఒక సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు. దీంతో 90'స్ అభిమానులే కాదు నేటితరం యువత కూడా ఈ సినిమా సీక్వెల్ ఎలా ఉండబోతుందో అని తెగ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. విషయంలోకి వెళ్తే..1999లో విడుదలైన నరసింహ చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్లు సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా నీలాంబరి అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అనగా డిసెంబర్ 12న నరసింహ సినిమాను తమిళ్లో రీరిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రకు సమానంగా నీలాంబరి క్యారెక్టర్ లో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ప్రస్తుతం సీక్వెల్ కోసం కథా చర్చలు కొనసాగుతున్నాయని.. తానే స్వయంగా కథ కూడా సిద్ధం చేస్తున్నానని.. మహిళలు మెచ్చే చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది అంటూ స్పష్టం చేశారు. మొత్తానికి అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నరసింహ సినిమా విషయానికొస్తే.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసి రజినీకాంత్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. రజినీకాంత్, శివాజీ గణేషన్, అబ్బాస్, నాజర్, సౌందర్య , రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇక రజినీకాంత్ విషయానికి వస్తే 7 పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఒకవైపు వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.. అలాగే కమలహాసన్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక సినిమా చేయడంతో పాటు కమలహాసన్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా కూడా చేస్తున్నారు.

Tags:    

Similar News