సూపర్ స్టార్ సినిమా హడావుడి ఏది..?

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్‌ హిట్‌ మూవీ 'జైలర్‌' కి సీక్వెల్‌గా రూపొందిన 'జైలర్‌ 2' ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Update: 2026-10-03 05:02 GMT

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్‌ హిట్‌ మూవీ 'జైలర్‌' కి సీక్వెల్‌గా రూపొందిన 'జైలర్‌ 2' ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు తమిళనాట విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది. సూపర్‌ హిట్ మూవీకి సీక్వెల్‌ కావడంతో పాటు, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌, అనిరుధ్‌ రవిచంద్రన్‌ కాంబినేషన్‌ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అనౌన్స్‌మెంట్‌ వీడియోతోనే సంచలనం సృష్టించిన ఈ జోడీ సినిమాను మరో లెవల్‌కి తీసుకు వెళ్లి ఉంటారని అంతా భావించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ వీడియోలు, పోస్టర్స్‌, గ్లిమ్స్‌, పాటలు అన్నీ సినిమాపై తమిళ తంబీల్లో అంచనాలు పెంచాయి. అయితే జైలర్ 2 కి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సందడి కనిపించడం లేదు. ప్రమోషన్‌ పెద్దగా చేయక పోవడంతో జనాల్లో చర్చ జరగడం లేదు.

రజనీకాంత్‌ జైలర్ 2 సినిమాతో...

జైలర్‌ 2 సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. సినిమాను ప్రముఖ నిర్మాతలు దక్కించుకునేందుకు ప్రయత్నించారని, చివరకు నాగవంశీ చేతికి జైలర్ 2 వచ్చిందని తమిళ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ప్రముఖ తమిళ నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మద్య కాలంలో సన్‌ పిక్చర్స్ నుంచి వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేయడంతో జైలర్‌ 2 పై అక్కడి ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇంకా జైలర్‌ 2 గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. సూపర్‌ స్టార్‌ మూవీ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో సరైన బజ్‌ క్రియేట్‌ కాలేదని చెప్పక తప్పదు.

సితార నాగవంశీ సమర్పణలో...

రజనీకాంత్‌ మూవీ కావడంతో పాటు నాగవంశీ ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విడుదల చేస్తున్న కారణంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరగాలి. కానీ ఇప్పటి వరకు నాగవంశీ నుంచి జైలర్‌ 2 కి సంబంధించిన ప్రమోషన్‌ స్టఫ్‌ బయటకు రాలేదని, ఆయన నోటి నుంచి జైలర్‌ 2 గురించి మాట్లాడితే అప్పుడు సినిమాకు బజ్‌ క్రియేట్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ మద్య కాలంలో తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్‌ సినిమాలను బలమైన కంటెంట్‌ ఉంటేనే ఆధరిస్తున్నారు. గతంలో మాదిరిగా మీడియం రేంజ్ ఉన్నా యావరేజ్‌ మూవీస్‌గా నిలిచే పరిస్థితి లేదు. అయితే దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ జైలర్ 2 ను అద్భుతంగా తీశాడని, బలమైన కంటెంట్‌తో సినిమా సాగుతుందని అంటున్నారు. కనుక తెలుగులో రజనీకాంత్‌ భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి.

నెల్సన్ దిలీప్‌, అనిరుధ్‌ రవిచంద్రన్‌ కాంబో...

గతంతో పోల్చితే రజనీకాంత్‌ సినిమాలు ఈమధ్య కాలంలో ఆశించిన స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆడిందే లేదు. మీడియం రేంజ్‌లో ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి కానీ లాంగ్‌ రన్ వసూళ్లు సాధించి చాలా కాలం అయింది. అందుకే జైలర్‌ 2 సినిమాతో మళ్లీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో జైలర్‌ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మళ్లీ జైలర్‌ 2 తోనే నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. జైలర్‌ 2 సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది కనుక ఇకపై పబ్లిసిటీ హడావుడి మొదలు పెట్టినా కచ్చితంగా విడుదల సమయంకు కచ్చితంగా మంచి రీచ్‌ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు వారాల సమయాన్ని నాగవంశీ అండ్ టీం సరిగ్గా వినియోగించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాస్త ఆలస్యంగా నాగవంశీ ఈ సినిమాను కొనుగోలు చేయడం వల్ల పబ్లిసిటీ హడావిడి ఇప్పటి వరకు లేదని, ఇక మీదట జైలర్‌ 2 డైరెక్ట్‌ తెలుగు సినిమాల రేంజ్‌లో నాగవంశీ పబ్లిసిటీ చేస్తాడని ఆయన సన్నిహితులు అనుకుంటున్నారు.

Tags:    

Similar News