ఆ ఒక్క మాటతో 'కూలీ' హైప్‌ డబుల్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'కూలీ'.;

Update: 2025-08-01 09:56 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'కూలీ'. రజనీకాంత్‌ కు పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఉంటారు, అంతే కాకుండా ఆయన సినిమాలు గతంలో ఇతర భాషల్లోనూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. తమిళ్‌లో రూపొందిన రజనీకాంత్‌ సినిమాలు దేశం మొత్తం కుదిపేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య జైలర్‌ సినిమాతో మరోసారి రజనీకాంత్‌ తన సత్తా చాటిన విషయం తెల్సిందే. జైలర్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. త్వరలో రాబోతున్న కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలు పెంచే విధంగా మెల్ల మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

జైలర్‌ హుకుం పాటను మించి..

ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతున్న కూలీ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూలీ సినిమాలోని పవర్‌ హౌస్‌ పాట గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రజనీకాంత్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలర్ సినిమాకు అనిరుధ్‌ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా జైలర్‌ కోసం అనిరుధ్ అందించిన హుకుం సాంగ్‌ నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా నిలిచిన విషయం తెల్సిందే. రజనీకాంత్‌ అభిమానులు మాత్రమే కాకుండా అందరు హీరోల అభిమానులు ఆ థీమ్‌ను ఆస్వాదించారు. హీరోయిజంను మ్యూజిక్‌తోనూ ఎలివేట్‌ చేయవచ్చు అని దీన్ని బట్టి నిరూపితం అయ్యింది అంటూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఆ సమయంలో మాట్లాడుకున్న విషయం తెల్సిందే.

అనిరుధ్‌కి ముద్దు పెట్టిన రజనీకాంత్‌

జైలర్‌ సినిమాలోని హుకుం పాట గురించి రజనీకాంత్‌ స్పందిస్తూ.. అనిరుధ్‌ భవిష్యత్తులో ఎప్పుడూ ఈ పాటను మించిన పాటను ఇవ్వలేడు అన్నాడు. అంతే కాకుండా స్టేజ్‌ పై అనిరుధ్‌కి ముద్దు పెట్టిన ఘటన అభిమానులు అంత సులభంగా మర్చి పోరు. రజనీకాంత్‌ నుంచి మళ్లీ ముద్దు పెట్టించుకోవాలి అనుకున్నాడో ఏమో కానీ అనిరుధ్ మరోసారి అంతకు మించిన పాటను కూలీ సినిమా కోసం అందించాడు. పవర్‌ హౌస్‌ పాట ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే విధంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కేవలం రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క హీరో అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యే విధంగా ఆ పాట ఉంటుందని, హుకం పాటకు రెట్టింపు హైప్‌ ఇచ్చే విధంగా ఉంటుందని స్వయంగా రజనీకాంత్‌ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

పవర్‌ హౌప్‌ పాటతో 'కూలీ' రేంజ్‌ డబుల్‌

హుకుంను మించిన పాటను అనిరుధ్‌ ఇవ్వలేడని అనుకున్నాం. కానీ అతడు పవర్ హౌస్‌ పాటతో నా అభిప్రాయం తప్పు అని నిరూపించాడు. అతడి మ్యూజిక్‌ పవర్‌ ఏంటి అనేది మరోసారి పవర్‌ హౌస్‌ పాటతో లోకానికి చెప్పబోతున్నాడని రజనీకాంత్‌ చెప్పాడు. రజనీకాంత్‌ చెప్పిన ఈ ఒక్క మాటతో కూలీ సినిమా హైప్‌ డబుల్‌ అయింది. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అనిరుద్‌ సంగీతంతో రాబోతున్న కారణంగా రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి ఫుల్‌ మీల్స్ ఖాయం అనే నమ్మకం ఉంది. ఇలాంటి సమయంలో రజనీకాంత్‌ వ్యాక్యలు మరో లెవల్‌కి సినిమాను తీసుకు వెళ్లాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో శృతి హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండగా నాగార్జున ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా వార్‌ 2 ను ఢీ కొట్టేందుకు వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్దకు రాబోతుంది.

Tags:    

Similar News