• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న మెచ్చిన గామి.....

జక్కన్న మెచ్చిన గామి.. ఏమన్నారంటే..

| ఇక చాలాకాలంగా గామి సినిమా కోసం కష్టపడిన మేకర్స్ ను కూడా కలిసిన రాజమౌళి వారి పనితనాన్ని మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో గామి టీం గురించి ఆయన ప్రస్తావించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-03-06 12:50 GMT

దర్శకధీరుడు రాజమౌళి మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రశంసించడంలో ఎల్లప్పుడూ కూడా ముందుంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రణాళికలో బిజీగా ఉన్న జక్కన్న మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ప్రత్యేకంగా థియేటర్లోకి వెళ్లి మరీ చూస్తున్నారు. ఇక ఎవరైనా డిఫరెంట్ గా హార్డ్ వర్క్ చేస్తే కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

ఇంకా బాగా మెప్పిస్తే ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని పిలిపించుకొని మరి వారు చేసిన పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇక చాలాకాలంగా గామి సినిమా కోసం కష్టపడిన మేకర్స్ ను కూడా కలిసిన రాజమౌళి వారి పనితనాన్ని మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో గామి టీం గురించి ఆయన ప్రస్తావించడం ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని కూడా ఆయన కోరుకున్నారు

"అసాధ్యమైన కలలు...కానీ వాటిని సాకారం చేయడానికి వారు కష్టపడుతున్నారు... ఆకట్టుకునే విజువల్స్ అంధించడం కోసం 4 సంవత్సరాలుగా వారు చేసిన కృషి గురించి నిర్మాత కార్తీక్ మరియు దర్శకుడు విద్యాధర్ నాతో మాట్లాడినప్పుడు గొప్ప ఫీలింగ్ అనిపించింది. మార్చి 8న విడుదల కానున్న గామి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు" అని రాజమౌళి అన్నారు.

రాజమౌళి ఈ విధంగా చెప్పడంతో గామి సినిమా ఇండస్ట్రీలో మరింత వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో విశ్వక్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. మానవ స్పర్శ అతనికి అతి పెద్ద శాపం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఇక ఆ సమస్య నుంచి బయటపడడానికి అతను హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుంది.

అక్కడ అతనికి ఎలాంటి సమాధానం దొరికింది అనేది సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమయింది. విశ్వక్ కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అతని క్యారెక్టర్ డిజైనింగ్ చూస్తేనే క్లారిటీ వచ్చేసింది. ఈనెల 8న థియేటర్లోకి రాబోతున్న గామి సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Gaami 
  • Gaamimovie 
  • Vishwaksen 
  • Chandinichowdhary 
  • Vidyadhar 
  • Director 
  • Socialmedia 
  • Rajamouli 
  • Note 
  • Filmindustry 

Similar News

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

Copyright @2026

Powered by Blink CMS