అందుకే ఎస్ఎస్ఎంబీ29 చేయట్లేదు
అయితే ఇప్పుడు ఇందులో ఓ కాంబినేషన్ ఇప్పుడు కలిసి సినిమా చేయడం లేదు. వారే రాజమౌళి- సెంథిల్ కుమార్.;
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఆడియన్స్ అలవాటు పడిపోయారు. కొంతమందికి ఎక్కడో సింక్ కుదరడం వల్ల వారి కాంబినేషన్ లో వచ్చే సినిమాల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ టాలీవుడ్ లో కొన్ని ఉన్నాయి. అందులో సుకుమార్- దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్, రాజమౌళి- సెంథిల్ కాంబినేషన్, సుకుమార్- చంద్రబోస్ కాంబినేషన్, రాజమౌళి- కీరవాణి ఇలా చాలానే ఉన్నాయి.
తాము రాసుకున్న స్క్రిప్ట్ ను వాళ్లైతైనే తమకంటే బాగా అర్థం చేసుకుని మంచి అవుట్‌పుట్ ఇవ్వగలరని సదరు డైరెక్టర్లు కూడా చెప్పిన సందర్భాలున్నాయి. దీంతో ఆడియన్స్ కూడా వారి కాంబోకు అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు ఇందులో ఓ కాంబినేషన్ ఇప్పుడు కలిసి సినిమా చేయడం లేదు. వారే రాజమౌళి- సెంథిల్ కుమార్.
రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చాలా వారకు సెంథిల్ వర్క్ చేశారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలకు తప్పించి మిగిలిన అన్ని సినిమాలకూ సెంథిలే సినిమాటోగ్రాఫర్ గా చేశారు. రాజమౌళి అనుకున్న కథను అనుకున్నట్టు స్క్రీన్ పై చూపించడంలో సెంథిల్ పాత్ర చాలానే ఉందని రాజమౌళి కూడా ఒప్పుకున్నారు.
అలాంటి సెంథిల్ ను రాజమౌళి, ఎస్ఎస్ఎంబీ29 కోసం పక్కన పెట్టారు. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29కు సెంథిల్ ప్లేస్ లో పీఎస్ వినోద్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. దీంతో జక్కన్నకు, సెంథిల్ కు మధ్య ఏమైందని అందరూ అనుకుంటున్నారు. తాజాగా సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన జూనియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన సెంథిల్ కు ఇదే ప్రశ్న ఎదురైంది.
దానికి సెంథిల్ రెస్పాండ్ అయి ఆన్సరిచ్చారు. తనకు, రాజమౌళికి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని, గతంలో కూడా తాను ఉండగానే రాజమౌళి మర్యాద రామన్న, విక్రమార్కుడు సినిమాలను వేరే వారితో చేశారని, ఆ తర్వాత మళ్లీ కలిసి వర్క్ చేశామని, ఇప్పుడు కూడా ఎస్ఎస్ఎంబీ29 కు అలానే అవుతుందని, ఇద్దరం అనుకునే ఈ సినిమా చేయడం లేదని, ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా ట్రై చేస్తున్నారని, కుదిరితే మళ్లీ ఫ్యూచర్ తో ఇద్దరం కలిసి సినిమాలు చేస్తామని సెంథిల్ తెలిపారు. అయితే సెంథిల్ చెప్పినట్టు రాజమౌళి విజువల్ పరంగా ఏదో కొత్తగా ప్రయత్నించడానికే సెంథిల్ ను కాకుండా వేరే వారిని తీసుకుని ఉండొచ్చని నెటిజన్లు కూడా భావిస్తున్నారు.