అంతులేకుండా పోతున్న అభిమానం
తమ అభిమాన సెలబ్రిటీ ఎవరు కనిపించినా వారి వెంట పడి వారితో ఫోటోలు, సెల్ఫీల కోసం వారిని ఇబ్బంది పెట్టడం ఈ మధ్య రెగ్యులర్ గా జరుగుతున్నాయి.;
కొందరికి ఏ సిట్యుయేషన్ లో ఎలా బిహేవ్ చేయాలో మినిమం జ్ఞానం కూడా ఉండదు. సెలబ్రిటీల విషయంలో ఫ్యాన్స్ అసలు ఎంత ఆతృతగా ఉంటారో, వారిని కలుసుకోవాలని ఎంత ప్రయత్నిస్తారో తెలిసిందే. వారి అభిమానాన్ని తప్పుబట్టలేం కానీ ఎంతటి అభిమాని అయినా సరే సమయం, సందర్భం గురించి ఆలోచించకుండా ప్రవర్తించడం మాత్రం చాలా పెద్ద తప్పు.
తమ అభిమాన సెలబ్రిటీ ఎవరు కనిపించినా వారి వెంట పడి వారితో ఫోటోలు, సెల్ఫీల కోసం వారిని ఇబ్బంది పెట్టడం ఈ మధ్య రెగ్యులర్ గా జరుగుతున్నాయి. తాజాగా విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు నివాళులు అర్పించడానికి తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలివచ్చింది.
అందులో భాగంగానే డైరెక్టర్ రాజమౌళి కూడా తన భార్య రమా రాజమౌళితో కలిసి కోటా శ్రీనివాసరావుకు నివాళులర్పించడానికి వచ్చారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కు కోటా చేసిన సేవలు, ఆయనతో తనకున్న బాండింగ్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళి తిరిగి వెళ్తుండగా ఆయనతో ఫోటో తీసుకునేందుకు ఓ అభిమాని ఎగ్జైట్ అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా కారు వైపు చాలా ఫాస్ట్ గా వెళ్లారు రాజమౌళి.
అతని ఫ్యాన్ కూడా జక్కన్న కు అడ్డం పడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, దీంతో చిర్రెత్తిపోయిన రాజమౌళి ఆ ఫ్యాన్ ను ఒక్క తోపు తోసి ఏంటిది అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కారెక్కి వెళ్లిపోయారు. సెల్ఫీ అడిగిన అభిమానిని రాజమౌళి ముందు చాలా సున్నితంగానే తప్పించుకుని వెళ్లారు. అయినప్పటికీ అతను వదలకపోవడంతో ఎప్పుడూ కూల్ గా ఉండే జక్కన్న అసహనానికి గురవగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఆ తర్వాత కాసేపటికి కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించడానికి జూ. ఎన్టీఆర్ అక్కడికి వచ్చారు. కోటాకు నివాళులర్పించాక ఆయన గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడుతుండగా కొందరు ఫ్యాన్స్ అక్కడ జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడంతో వెంటనే అలెర్ట్ అయిన ఎన్టీఆర్, చావు ఇంటి వద్ద అలాంటి నినాదాలు చేస్తారా అనే ఉద్దేశంతో అలా అనొద్దని సూచిస్తూ జై కోటా అని నినాదం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.