సారీ చెప్పిన రాహుల్..

నవంబర్ 7వ తారీఖున మొత్తం మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.;

Update: 2025-11-08 07:33 GMT

ఈరోజుల్లో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ కంప్లీట్ గా తగ్గిపోయారు. ఒక సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తే కానీ.. ఆడియన్స్ సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దాదాపు తగ్గింది అనే విషయం తెలిసిందే. కేవలం స్టార్ హీరోల సినిమాలు విడుదల అయితేనే థియేటర్స్ దగ్గర హడావిడి కనిపిస్తుంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల షోలు కూడా పలు కారణాల వల్ల క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. రిలీజ్ రోజు కూడా కనీసం మార్నింగ్ షో కి 50 మంది ఆడియన్స్ ఉండట్లేదు అనేది వాస్తవం.

నవంబర్ 7వ తారీఖున మొత్తం మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అయితే ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాంటి వాటిలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో.. రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో డైరెక్టర్ రాహుల్ క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ పంచుకున్నారు.

ఇది చూసిన నెటిజన్స్.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే డైరెక్టర్ ఎందుకు క్షమాపణలు చెబుతున్నాడు? అంటూ సందేహం వ్యక్తం చేయగా.. కొన్ని విషయాల్లో రాహుల్ రవీంద్రన్ ఆలోచించే విధానం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి రీసెంట్ గా అతను చేసిన ట్విట్టర్ పోస్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్. తాను దర్శకత్వం వహించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి రెస్పాన్స్ కూడా రాహుల్ రవీంద్రన్ స్వీకరిస్తూ ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఎవరైనా సినిమాలో తమకు నచ్చిన అంశాలు చెబితే వాటికి రియాక్ట్ అవుతున్నారు.

"ట్విట్టర్ లో తన సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇస్తూ ఉంటే, టైం లైన్ అంతా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసమే నిండిపోతుంది. అయితే ఇలా వరుసగా సినిమాకి సంబంధించిన న్యూస్ షేర్ చేయడం వలన ఇబ్బంది పడుతున్న వాళ్ళు క్షమించండి. ఈరోజుల్లో కేవలం మౌత్ టాక్ తోనే చాలా సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తాయి. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా బాగుంది కాబట్టి, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ని షేర్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఎక్కువమంది సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ప్రతి ట్వీట్ రిపీట్ చేస్తూ ప్రతి రెస్పాన్స్ కి రియాక్ట్ అవుతున్నాను" అని రాహుల్ రవీంద్రన్ చెప్పాడు.

ఇందులో లీడ్ రోల్ పోషించిన రష్మిక విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది రష్మిక. ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమా మరింత ప్లస్ అయింది. రష్మిక తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలానే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో భూమా దేవి అనే పాత్రలో కనిపించింది రష్మిక. అయితే ఈ సినిమాలో రష్మిక పర్ఫామెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. సినిమాలో ఏ సీన్స్ అయితే హైలైట్ గా నిలిచాయో.. వాటి పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రష్మికకు ఎలివేషన్ ఇస్తున్నారు.




Tags:    

Similar News