స్ట‌న్నింగ్ మేకోవ‌ర్: అగ్గి రాజేసిన రాశీ ఖ‌న్నా లేటెస్ట్ ఫోటోషూట్

తాజాగా రాశీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన బ్లాక్ అండ్ బోల్డ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Update: 2026-07-28 10:11 GMT

టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన నటన - గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రాశీ ఖన్నా. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల భామ... తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా రాశీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన బ్లాక్ అండ్ బోల్డ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. నలుపు రంగు దుస్తుల్లో రాశీ ఖన్నా ఒలికించిన సొగసులు అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.



 


ఈ ప్రత్యేకమైన ఫొటోషూట్ కోసం ఈ దిల్లీ బ్యూటీ ధరించిన అవుట్‌ఫిట్... మేకప్ త‌న‌ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఫ‌ర్ యువ‌ర్ రిఫ‌రెన్స్! అనే క్యాప్షన్‌తో పాటు తన స్టైలిస్ట్ శీఫా జే గిలానీ, మేకప్, హెయిర్ అండ్ ఫొటోగ్రఫీ టీమ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ `టేక్స్ ఏ విలేజ్‌`అని పోస్ట్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో రాజసం ఉట్టిపడేలా రాశీ ఇచ్చిన ఫోజులు, స్టైలింగ్ న భూతో నభవిష్యతి అన్నట్లుగా ఉన్నాయని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



 


ఈ ఫొటోలు పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందాల రాశీఖ‌న్నా అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లతో రీ-పోస్ట్‌లు చేస్తున్నారు.`నలుపు రంగు ఇంత అందంగా ఎప్పుడూ లేదు`, `బాలీవుడ్, టాలీవుడ్‌లలో ఒక కొత్త సంచలనం`,`10 అవుట్ ఆఫ్ 10` అంటూ నెటిజన్లు కామెంట్ల సెక్షన్‌లో హార్ట్, ఫైర్ ఎమోజీలతో రాశీ గ్లామర్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.



 


గత కొన్ని రోజులుగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన యాక్టింగ్ స్కిల్స్‌తో మెప్పిస్తున్న రాశీ ఖన్నా, ఇలాంటి ఫ్యాషన్ షూట్స్‌తో తన గ్లామర్ కోణాన్ని కూడా ఆవిష్క‌రిస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్లుగా పర్ఫెక్ట్ ఫ్యాషన్ సెన్స్‌తో కనిపిస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ముఖ్యంగా యువతలోఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఈ ఫొటోలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.



 


ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఒకవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే, మరోవైపు గ్లామరస్ పాత్రలతో అలరిస్తున్న ఈ భామ మునుముందు మరిన్ని భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం `తలాఖోన్ మే ఏక్` అనే బాలీవుడ్ చిత్రంలో న‌టిస్తోంది. విక్రాంత్ మాస్సేతో రాశీకి ఇది రెండో చిత్రం. ఇది ఒక గ్రిప్పింగ్ డ్రామాగా రూపొందుతోంది. ఆర్. మాధవన్, సోహా అలీ ఖాన్‌లతో కలిసి రాశీ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `బ్రిడ్జ్` యూకే నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్‌లతో కలిసి అనీస్ బ‌జ్మి రూపొందించ‌నున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లోను రాశీ న‌టించ‌నుంది. షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజ్ అండ్ డీకే `ఫర్జీ 2` వెబ్ సిరీస్ లోను రాశీ న‌టించ‌నుంది. ఇక ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరొకసారి సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచింది రాశీ ఖన్నా.



 


Tags:    

Similar News