• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. తొందరగా ఏదో...

పుష్ప 2.. తొందరగా ఏదో ఒకటి తేల్చండి బాబు

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది

By - Tupaki Desk
Update: 2024-06-13 05:57 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుష్ప హిట్ కావడంతో ఈ సీక్వెల్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాగా పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర హైప్ క్రియేట్ చేసుకొని ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

మూవీ నుంచి రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలుగా పుష్ప 2 సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందనే మాట వినిపిస్తోంది. అయితే సుకుమార్ అవుట్ ఫుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. రిలీజ్ లేట్ అయిన కూడా తాను అనుకున్న విధంగా వచ్చే వరకు మూవీపైన వర్క్ చేస్తూనే ఉంటాడు.

తాజాగా చియాన్ విక్రమ్ పాన్ ఇండియా మూవీ తంగలాన్ ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హిందీలో అక్షయ్ కుమార్ మూవీ కూడా అదే డేట్ కి థియేటర్స్ లోకి రాబోతుందంట. పుష్ప 2 రిలీజ్ అవుతుందని ఆగష్టు 15 నుంచి చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. అయితే ఇప్పుడు కారణాలు తెలియదు కానీ పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

తమిళ్, హిందీ సినిమాలలో రెండు సినిమాలు ఆగష్టు 15 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పుష్ప 2 వాయిదా పడిందనే టాక్ విస్తృతంగా నడుస్తోంది. డిస్టిబ్యూటర్స్ కూడా పుష్ప 2 రిలీజ్ వాయిదా పడబోతోందని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రెండు సంవత్సరాలుగా మూవీ షూటింగ్ జరుగుతుంది. బాగా ఆలస్యంగా చిత్రీకరణ నడుస్తోంది. దీనికి తోడు అనుకున్న రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు వాయిదా ప్రచారం జరుగుతూ ఉండటంతో నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ పై రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంట. ఆగష్టు 15న అనుకున్న రిలీజ్ వాయిదా పడితే డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారంట. అయితే ఆ టైమ్ లో కూడా పోటీ ఉండకుండా ఉండదు. ఆగస్టు 15 మిస్సయితే మాత్రం మిగతా సినిమాలతో రిస్క్ చేసి పోటీకి దిగాల్సిందే. మరి పుష్ప 2 టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Rashmika 
  • Pushpa2release 
  • Filmindustry 
  • Iconstar 
  • Pushpa2movie 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS