• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 ఫస్ట్‌ డే...

పుష్ప 2 ఫస్ట్‌ డే రికార్డ్‌కి వాళ్లే కీలకం..!

| అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

By - Tupaki Desk
Update: 2024-12-01 05:58 GMT

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్‌ 4 రాత్రి 9.30కి ప్రీమియర్‌ షోలు పడబోతున్నాయి. అలాగే డిసెంబర్‌ 4వ తారీకునే యూఎస్‌తో పాటు పలు దేశాల్లో స్క్రీనింగ్‌ మొదలు కాబోతుంది. ఉత్తర భారతంలో మాత్రం ఈ సినిమా డిసెంబర్ 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల హిందీ పుష్ప 2 కోసం అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయింది. పుష్ప 2 సినిమాకు హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఎలా ఉంది అనేది ఇప్పటికే నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్‌తో తేలిపోయింది.

పుష్ప 2 సినిమా హిందీ వర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయిన కొన్ని నిమిషాల్లోనే బుక్‌ మై షో ద్వారా పది వేల టికెట్లు అమ్ముడు పోయాయి. ఆన్‌ లైన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్‌ లైన్‌ ద్వారా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిల్చుని మరీ పుష్ప 2 సినిమా టికెట్లను హిందీ ప్రేక్షకులు తీసుకున్నారు. 24 గంటలు పూర్తి కాకుండానే రికార్డ్‌ స్థాయిలో పుష్ప 2 హిందీ టికెట్లు అమ్ముడు పోయాయి అంటూ డిస్ట్రిబ్యూటర్స్‌ చెబుతున్నారు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌ను క్రాస్‌ చేసి మరీ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డ్‌ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాలి అంటే కచ్చితంగా సినిమా నార్త్‌లో భారీ ఓపెనింగ్స్ రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా మొదటి రోజు సినిమా వసూళ్ల విషయానికి వస్తే హిందీ బెల్ట్‌ నుంచి వచ్చే వసూళ్లు కీలకంగా ఉంటాయి. కనుక అక్కడ అడ్వాన్స్ బుకింగ్‌ ఎక్కువ జరగాలని మేకర్స్ మొదటి నుంచి అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతోంది. అనుకున్న దాని కంటే ఎక్కువగానే మొదటి రోజు వసూళ్లు ఉంటాయి అంటూ నిర్మాతలకు నమ్మకం కలిగించే విధంగా నార్త్‌ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవుతున్నాయి.

మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 సినిమా నిలవాలి అంటే కచ్చితంగా హిందీ ప్రేక్షకుల ప్రోత్సాహం చాలా అవసరం. వారి నుంచి పుష్ప 2 కి వస్తున్న ముందస్తు ఆధరణ నేపథ్యంలో సరికొత్త నెంబర్ ఆవిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 మొదటి రోజు వసూళ్ల రికార్డు సంవత్సరాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఏ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ పుష్ప 2 కి దక్కడంతో పాటు కేవలం హిందీ మార్కెట్‌లోనే సినిమా లాంగ్‌ రన్‌ లో రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Rashmika 
  • Northindia 
  • Pushpa2bookings 
  • Wildfire 
  • Pushpa2firstdaycollections 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS