రామ్ చరణ్‌గా నేను ఏమైనా చేయొచ్చు.. కానీ చిరంజీవి కొడుకుగా కష్టపడాల్సిందే
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది`' ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది`' ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రసమర్పకుడు మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ మాట్లాడుతూ..రామ్ చరణ్ అంకితభావాన్ని, మెగాస్టార్ చిరంజీవి లెజెండరీ లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పడే కష్టాన్ని ప్రశంసిస్తూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. చిరంజీవి గారి వారసత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం అంటే ఎంతో కష్టపడాలని, చరణ్ అదే అంకితభావంతో పనిచేస్తున్నారని రవిశంకర్ కొనియాడారు.
ఈ సందర్భంగా రవిశంకర్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సినిమా కోసం ఎంత కష్టాన్ని అయినా భరించే చరణ్ ని ఒకసారి ఎందుకు సార్ అంత కష్టం? అని ప్రశ్నించాను. దానికి రామ్ చరణ్ ఎంతో సింపుల్ గా.. అంతే బాధ్యతగా బదులిస్తూ.. ``రామ్ చరణ్‌గా నేను ఏమైనా చేయొచ్చు. కానీ చిరంజీవి గారి కొడుకుగా నేను కష్టపడాల్సిందే`` అని అన్నట్లు రవిశంకర్ పేర్కొన్నారు.
చరణ్ చెప్పిన ఈ ఒక్క సింపుల్ లైన్.. ఒక లెజెండరీ లెగసీని భుజాన వేసుకుని ముందుకు నడిపించడంలో తనకు ఉన్న బాధ్యతను... ప్రేక్షకుల అంచనాలను ఎంతగా గౌరవిస్తారో స్పష్టం చేస్తోందని రవిశంకర్ అన్నారు. గతంలో `రంగస్థలం` చిత్రంలో చరణ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూశామని.. కానీ `పెద్ది`లో అంతకుమించి మరో స్థాయిలో కనిపిస్తారని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని చెబుతూ.. ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ బ్లాక్‌బస్టర్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
చివరగా సినిమా విజయంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ..`పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఉన్న పాత రికార్డులన్నింటినీ పూర్తిగా తారుమారు చేస్తుందని మైత్రి రవిశంకర్ బలంగా ప్రకటించారు. ఒక స్టార్ వారసుడిగా తనపై ఉన్న బాధ్యతను- ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చరణ్ పడిన శ్రమ వృథా పోదని అన్నారు.
నిర్మాత మాటలను బట్టి.. ``రామ్ చరణ్‌గా నేను ఏమైనా చేయొచ్చు.. కానీ చిరంజీవి కొడుకుగా కష్టపడాల్సిందే`` అని చరణ్ అన్న మాటలు.. భవిష్యత్తు తరాల స్టార్ కిడ్స్‌కు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ``చిరంజీవి కొడుకుగా నేను కష్టపడాల్సిందే`` అనే రామ్ చరణ్ బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం.. నిర్మాతలు చెబుతున్న హైలైట్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద `పెద్ది` చిత్రం సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.