కూతురుతో ప్రియాంక.. ఇక SSMB 29 షురూ

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల బర్త్ డే సంబరాలు గ్రాండ్ గా జరుపుకుంది. ఫ్యామిలీతో కలిసి ఆమె ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేసింది.;

Update: 2025-08-04 11:00 GMT

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల బర్త్ డే సంబరాలు గ్రాండ్ గా జరుపుకుంది. ఫ్యామిలీతో కలిసి ఆమె ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేసింది. ఇక సంబరాలు అన్నీ ముగిశాక, ప్రియాంక తాజాగా వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. ఆమె తన కుమార్తె మాల్తీ మారితోపాటు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది.


కారులో ప్రయాణిస్తుండగా ప్రియంక ఫొటోలు తీసి.. పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కుమార్తె తన సీటులో హాయిగా కూర్చున్నట్లు కనిపిస్తుంది. చిన్నారి ఇందులో పింక్ డ్రెస్ ధరించి ఉంది. చిన్నారి కింద పడకుండా ప్రియాంక జాగ్రత్తగా ఆమెను పట్టుకుంది. ఈ ఫొటోలకు మామా అండ్ మాల్టీ (అమ్మా అండ్ మాల్టీ), హైదరాబాద్ వీ మేడ్ ఇట్ అని రాసుకొచ్చింది.


అయితే ప్రియాంక హైదరాబాద్ వచ్చిందంటే మహేశ్ బాబు- రాజమౌళి సినిమా కోసమేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. అయితే దాదాపు ప్రియాంక ఎప్పుడూ హైదరాబాద్ కు రాదు. ఆమె షూటింగ్ లు ఉంటేనే ఇక్కడికి వస్తుంది. ఈ లెక్కన ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ SSMB 29. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసమే ప్రియాంక హైదరాబాద్ వచ్చిననట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం ప్రియాంక అటు అమ్మగా, ఇటు ప్రొఫషనల్ నటిగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఏ రోల్ కు ఇచ్చే టైమ్ ఆ రోల్ కు ఇచ్చేస్తూ పర్ఫెక్ట్ నటి అని, పర్ఫెక్ట్ తల్లి అని అనిపించుకుంటుంది అటు ఫ్యాన్స్ కూడా తాను రెండు పాత్రలు ఒకేసార చేయడం, షూటింగ్ ల సమయంలో పాపను కేర్ టేకర్ లు ఇవ్వకుండా.. తనతో పాటే తీసుకెళ్లడం ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా ఇలా రెండు పాత్రలు పోషించడం కూడా అద్భుతమే!

ఇక ప్రస్తుతం SSMB 29 షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఇప్పటికే ఒడిశాలో ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గతనెలలోనే కెన్యాలో ఇంకో ముఖ్యమైన షెడ్యూల్ చేయాల్సి ఉండగా, అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మరి ప్రస్తుతం షూటింగ్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో మహేశ్ ఓ సాహస యాత్రికుడిగా ప్రపంచాన్ని చుట్టే పాత్రలో కనిపించను్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుర్గా బ్యానర్పై కేఎల్ నారాయణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News