రౌడీ హీరోతో స్పెషల్ సాంగ్ కి సిద్ధమైన కన్నప్ప బ్యూటీ!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే సమంతను మొదలుకొని తమన్నా వరకూ .. ఈ తరం హీరోయిన్స్ లో పూజా హెగ్డే, శ్రీ లీల వంటి హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్లు చేసి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ జాబితాలోకి కన్నప్ప బ్యూటీ కూడా వచ్చి చేరింది .ఆ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు తాజాగా రౌడీ హీరోతో మాస్ స్టెప్స్ వేయడానికి సిద్ధమయ్యింది. ఆమె ఎవరో కాదు మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ గా వచ్చిన కన్నప్ప సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రీతి ముకుందన్.
విజయ్ తో కన్నప్ప బ్యూటీ స్పెషల్ సాంగ్..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా , కీర్తి సురేష్ హీరోయిన్గా వస్తున్న రౌడీ జనార్ధన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఇందులో విజయ్ తో అదిరిపోయే డాన్స్ చేయడానికి కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని అందుకోసమే ప్రీతిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
రౌడీ జనార్ధన వచ్చేది అప్పుడే..
భారీ అంచనాల మధ్య రాయలసీమ గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
డబుల్ మ్యూజిక్ ట్రీట్..
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాతో డబుల్ మ్యూజిక్ ట్రీట్ ఇవ్వడానికి చిత్ర బృందం సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రేమలు మూవీ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తుండగా.. ఇప్పుడు ఆయనతో పాటు టాక్సిక్ , యానిమల్ చిత్రాలకు సంగీతం అందించిన బాలీవుడ్ సెన్సేషన్ విశాల్ మిశ్రా కూడా ఈ భారీ ప్రాజెక్టులో భాగమయ్యారు . ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కలయికతో రౌడీ జనార్ధన ఆల్బమ్ బాధ్యతలను మేకర్స్ మరింత స్మార్ట్ గా డివైడ్ చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి ఏ బాధ్యతలు?
ఇక ఈ సినిమాలోని లవ్.. ఎమోషనల్ .. మాస్ సాంగ్స్ కు విశాల్ మిశ్రా మ్యూజిక్ సమకూర్చారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ తో పాటు సౌత్ లో కూడా బ్లాక్ బస్టర్ ట్రాక్స్ ఇచ్చి మంచి పేరు దక్కించుకున్న విశాల్ మిశ్రా ఇప్పుడు ఈ సినిమాకి పెద్ద అసెట్ గా నిలిచారు. ఇక రూరల్ యాక్షన్ సీక్వెన్స్ లకు ప్రాణం పోసేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను క్రిస్టో జేవియర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.