• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరల్డ్ బెస్ట్ స్పాట్ లో...

వరల్డ్ బెస్ట్ స్పాట్ లో అంజనాద్రి 2.0

| ఈ నేపథ్యంలో జై హనుమాన్ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ అందించారు ప్రశాంత్ వర్మ. సోషల్ మీడియాలో స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-03-31 06:46 GMT

2024 సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ.. ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. చిన్నగా మొదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం.. ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక లాభాలు కురిపించిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక హనుమాన్ బ్లాక్ బస్టర్ కావడంతో వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. జనవరి 22వ తేదీన అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు. అయితే ఈ మధ్య జై హనుమాన్ సినిమా లేట్ అవుతుందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జై హనుమాన్ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ అందించారు ప్రశాంత్ వర్మ. సోషల్ మీడియాలో స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు. అందమైన కొండల మధ్యలో నది.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచయం చేస్తూ వెల్ కమ్ టు అంజనాద్రి 2.0 అంటూ పోస్ట్ చేశారు. #Jai Hanuman హ్యాష్‌ ట్యాగ్‌ కూడా యాడ్ చేశారు. హనుమాన్ మూవీలోని రఘునందన సాంగ్ ను అటాచ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం.. వియత్నాంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ హలాంగ్ బే. ఇక్కడ ఇప్పటికే అనేక హాలీవుడ్ చిత్రాలు షూట్ చేశారు. కింగ్ కాంగ్ స్కల్ ఐలాండ్, కింగ్ వర్సెస్ గాడ్జిల్లా సహా అనేక సినిమాలు ఇక్కడే తెరకెక్కించారు. ఎక్కువగా కాంగ్ సీరీస్ లో వచ్చిన సినిమాలకు ఇది స్పెషల్ షూటింగ్ స్పాట్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా ప్రేమికులకు కూడా ఈ ప్లేస్ తో స్పెషల్ కనెక్షన్ ఉంది.

ఈ ప్లేస్ కు అమెరికా, యూకే, యూరప్ నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. తమ గర్ల్ ఫ్రెండ్ కు రింగ్ పెట్టి ఇక్కడ లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఈ ప్రదేశం అందుకు బాగా స్పెషల్. అలాగే ఇక్కడ లవ్ ప్రపోజల్ చేస్తే ఎప్పటికి విడిపోము అనేంతలా నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ప్రదేశాన్ని ప్రశాంత్ వర్మ తెలుగు ప్రేక్షకులకు మరింత అందంగా చూపించబోతున్నాడు.

ఈ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లో జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ కన్నా జై హనుమాన్ విజువల్స్ మరింత గ్రాండ్ గా ఉండడం పక్కా అని చెప్పవచ్చు. ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది ప్రశాంత్ వర్మ పోస్ట్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ సిద్ధమవుతున్నారు.

హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటేంటనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్‌ తెరకెక్కతోంది. అయితే ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని, హనుమంతు పాత్రలో కేవలం కనిపిస్తారని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పారు. హీరో ఆంజనేయుడని, ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారని వెల్లడించారు. ఉగాదికి ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ప్రశాంత్ వర్మ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో.

Welcome to Anjanadri 2.0! ⛰️ #JaiHanuman @ThePVCU pic.twitter.com/B3sPPfqgXP

— Prasanth Varma (@PrasanthVarma) March 31, 2024
Tags:    
  • Prashantvarma 
  • Specialglimpses 
  • Anjanadri 
  • Tejasajja 
  • Amrithaiyer 
  • Jaihanuman 
  • Tollywood 
  • America 
  • Uk 
  • Europe 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS