• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుకున్న సమయానికే...

అనుకున్న సమయానికే హనుమాన్​.. ఓ ప్లాన్ రెడీ

| విజువల్స్‌తో వండర్స్​తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ

By - Tupaki Desk
Update: 2023-08-19 10:15 GMT

విజువల్స్‌తో వండర్స్​తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. కొత్త కాన్సెప్ట్‌ల సినిమాలతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే 'హను-మాన్‌'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో రిలీజ్‌ కానున్నట్లు ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. సోషల్​మీడియాలో యూట్యూబ్‌లో ఫుల్​ ట్రెండింగ్‌ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుందీ టీజర్​. అప్పట్లో ఈ టీజర్ విజువల్ ఎఫెక్ట్ వల్ల భారీ బడ్జెట్​ ఆదిపురుష్​ కూడా ట్రోల్స్​కు గురౌవ్వాల్సి వచ్చింది.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్​ అవుతుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ప్రశాంత్​ వర్మ ఈ చిత్రంతో ఏదో అద్భుతమే చేస్తాడని భావిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలే పెటుకున్నారు. అయితే టీజర్ రిలీజయ్యాక.. ఈ సినిమా ఎలాంటి చప్పుడు చేయలేదు. ఎటువంటి అప్డేట్స్​ కూడా రాలేదు.

దీంతి ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే అదే సమయంలో మహేశ్ గుంటూరు కారం, కమల్​ హాసన్​ ఇండియన్ 2 చిత్రాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ముందుగా అనుకున్న తేదీ ప్రకారం పక్కాగా విడుదల చేయాలని మూవీటీమ్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. విడుదల తేదీకి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటం వల్ల ఇక ప్రమోషన్స్​ కూడా మొదలుపట్టాలని మూవీటీమ్ ఫిక్స్ అయిందట

అక్టోబర్​లో ట్రైలర్​ విడుదల చేసి ప్రమోషన్స్​ ప్రారంభిస్తారని తెలిసింది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం వల్ల.. ఇక అప్పటి నుంచి నాన్​ స్టాప్​ పబ్లిసిటీ చేస్తారట. బాలీవుడ్​లో పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. పబ్లిసిటీకి కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా రెడీ అయిపోయిందని ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో తెలిపారు దర్శకుడు ప్రశాంత్. ఈ సినిమా కోసం ఎన్నో వీఎఫ్ఎక్స్‌ స్టూడియోలతో కలిసి పనిచేశారట. సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. అమృతా అయ్యర్‌ హీరోయిన్​గా నటించింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు.

Tags:    
  • Prashanthvarma 
  • Hanumanmovie 
  • Hanuman 
  • Tejasajja 
  • Maheshbabu 
  • Gunturkaaram 
  • Kamalhassan 
  • Indian2 
  • Amrithaaiyer 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS