• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్ లో చేసిన తప్పే...

కేజీఎఫ్ లో చేసిన తప్పే సలార్ లో కూడా..

| కేజీఎఫ్ తో బాక్సాఫీస్ వద్ద కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో మనకు తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-12-20 03:00 GMT

కేజీఎఫ్ తో బాక్సాఫీస్ వద్ద కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించారో మనకు తెలిసిందే. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ప్రభాస్ నటించిన సలార్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలిపార్ట్ సలార్- సీజ్ ఫైర్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ల స్పీడ్ ను పెంచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేజీఎఫ్ తోగానీ, కేజీఎఫ్ యూనివర్స్ తో గానీ సలార్ కు ఎలాంటి కనెక్షన్ లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. అయితే కేజీఎఫ్ కు చేసిన తప్పే సలార్ కు కూడా చేశానని చెప్పి షాక్ ఇచ్చారు. కేజీఎఫ్ సినిమా టైమ్ లో ఫైనల్ కట్ రెడీ చేసిన తర్వాత దానిని ఒకసారి చూసి ఏమన్నా ఛేంజెస్ చేయాలా అని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయానని చెప్పారు.

ఇప్పుడు సలార్ కు కూడా అదే తప్పును రిపీట్ చేశానని ప్రశాంత్ నీల్ తెలిపారు. అయినా సరే మూవీ ఫైనల్ అవుట్ పుట్ పై చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అయితే సలార్ చిత్రాన్ని మహాభారతంతో పోల్చారు బాలీవుడ్ నటుడు టిన్నూ ఆనంద్. సలార్ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు స్టార్ హీరోయిన్ శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, తొలి సింగిల్, రెండు ట్రైలర్స్ ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Prashanthneel 
  • Salaar 
  • KGF 
  • Prabhas 
  • Yash 
  • Filmindustry 
  • Shrutihaasan 
  • Prithvirajsukumaran 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS