గ్లోబల్ లెవెల్ లో ఎన్టీఆర్ - నీల్

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఒక్క కథను కూడా దేశాన్ని దబాటించింది లేదు.;

Update: 2025-09-01 19:02 GMT

‘వార్ 2’ డిజాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఫోకస్ మొత్తం ఒకే సినిమా మీద ఉంది. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా. డ్రాగన్ అనే టైటిల్ డిస్కషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక కెజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో నీల్ తన స్టైల్ చూపించిన తర్వాత, ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలసి మరో రేంజ్‌లో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్‌పై అంచనాలు మొదటి నుంచి హై రేంజ్ లోనే ఉన్నాయి

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఒక్క కథను కూడా దేశాన్ని దబాటించింది లేదు. కథ మొత్తం ఒక దేశం లేదా ఒక ఉహాత్మక ప్రపంచంలో జరుగుతున్నట్లు చూపిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం స్టోరీ డిమాండ్ మేరకు ఆయన బౌండరీల దాటి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ఎన్టీఆర్ సినిమాలో గ్లోబల్ కనెక్షన్ ఉండటంతో, మొదటిసారి ఇండియాకు వెలుపల ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ షూట్ జరుగుతుందనేది ఇప్పటివరకు రహస్యంగానే ఉంచారు కానీ, ఈ నిర్ణయం సినిమా స్కేల్‌ని మరింత పెంచింది. సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో తారక్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడని మేకర్స్ చెప్పినట్టే, పోస్ట్ ప్రొడక్షన్ దశ నుంచే అంచనాలు పెరిగాయి.

ఈసారి ఆయన పాత్రలో మాఫియా షేడ్స్, పవర్‌ఫుల్ యాక్షన్ ట్రాక్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాడు. డ్రాగన్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకుండా, ఎమోషనల్ కనెక్ట్ కలిగించేలా స్టోరీని రాసినట్లు సమాచారం.

ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటికంటే ఇది బెస్ట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన మ్యూజిక్ ఇప్పటికే కెజీఎఫ్‌కి పానిండియా లెవెల్‌లో ఒక కొత్త ఇమేజ్ ఇచ్చింది. అదే రేంజ్‌లో డ్రాగన్‌కి కూడా ఆయన మ్యూజిక్ హైలైట్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 జూన్‌లో గ్రాండ్ రిలీజ్ టార్గెట్‌గా టీమ్ ముందుకు వెళ్తోంది.

Tags:    

Similar News