ప్రశాంత్ వర్మ.. అంతా సెట్టయినట్లేనా..

అయితే హనుమాన్ తర్వాత ఇప్పటి వరకు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేదు ప్రశాంత్ వర్మ. ఆయన నుంచి కొత్త సినిమా రాకుండా.. వస్తున్న సంక్రాంతితో రెండేళ్లు అవుతుంది.;

Update: 2025-11-10 09:33 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. హనుమాన్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటికే పలు సినిమాలు తెరకెక్కించిన ఆయన.. హనుమాన్ తో పాన్ ఇండియా రేంజ్ లో అలరించి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అయితే హనుమాన్ తర్వాత ఇప్పటి వరకు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాలేదు ప్రశాంత్ వర్మ. ఆయన నుంచి కొత్త సినిమా రాకుండా.. వస్తున్న సంక్రాంతితో రెండేళ్లు అవుతుంది. కానీ ఆయన లైనప్ లో భారీ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే వాటిని అనౌన్స్ చేసినా.. ఈ మధ్య కాలంలో ఎలాంటి మ్యాసివ్ అప్డేట్ మాత్రం ఇవ్వలేదు.

అందులో ఒకటి జై హనుమాన్. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ కు సీక్వెల్ గా ఆ సినిమా రానున్న సంగతి విదితమే. ఇప్పటికే సీక్వెల్ ఉంటుందని చెప్పిన ప్రశాంత్ వర్మ.. ఆ మధ్య చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

దీంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఆ విషయాన్ని రిషబ్ శెట్టి.. ఇటీవల తన కాంతార చాప్టర్ 1 మూవీ ప్రమోషన్స్ లో స్పష్టం చేశారు. చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. 2026 జనవరిలో సెట్స్‌ పైకి మూవీ వెళ్తుందని తెలిపారు.

అయితే ఆయన చెప్పింది నిజమే. 2026 జనవరిలో షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు ఇప్పుడు ప్రశాంత్ వర్మ సిద్ధమవుతున్నారని సమాచారం. రీసెంట్ గా ఆయనపై కొన్ని ఆరోపణలు రాగా.. ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అంతా సెట్ అయినట్లు కనిపిస్తున్నారు. షూటింగ్ ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఇక హనుమాన్ సీక్వెల్ కావడంతో జై హనుమాన్ పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు రిషబ్ శెట్టి లాంటి పర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్ నటుడు ప్రధాన పాత్రలో కనిపించనుండండతో ప్రాజెక్ట్‌ పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే 2026 జనవరిలో సెట్స్ పైకి మూవీ వెళ్లనుండగా.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కలుపుకుంటే సినిమా 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News