గ్లామరస్ డ్రెస్సులో 'అఖండ' భామ.. ప్రజ్ఞా జైస్వాల్ ఫోటోషూట్ వైరల్!
టాలీవుడ్‌లో కంచె' సినిమాతో సంచలనం సృష్టించి ఆపై 'అఖండ' విజయంలో పవర్‌ఫుల్ ప్రదర్శనతో మెప్పించిన హాట్ బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్.
టాలీవుడ్‌లో కంచె' సినిమాతో సంచలనం సృష్టించి ఆపై 'అఖండ' విజయంలో పవర్‌ఫుల్ ప్రదర్శనతో మెప్పించిన హాట్ బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్. గత ఏడాది నందమూరి బాలకృష్ణ సరసన 'డాకు మహారాజ్' చిత్రంలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా 'ఆల్ గ్లామ్డ్ అప్' అంటూ షేర్ చేసిన గ్లోయింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
'కంచె' నుంచి 'డాకు మహారాజ్' వరకు ప్రతిభ:
2014లో 'టిటూ ఎంబీఏ'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రజ్ఞా, తెలుగులో 'మిర్చి లాంటి కుర్రాడు'తో ఎంట్రీ ఇచ్చింది. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక చిత్రం 'కంచె' ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర', నందమూరి బాలకృష్ణతో 'అఖండ' మరియు రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'డాకు మహారాజ్' చిత్రాల్లో నటిస్తూ వాణిజ్యపరంగా మంచి విజయాన్ని అందుకుని తన క్రేజ్‌ను నిలబెట్టుకుంది.
సిల్వర్ గౌనులో అల్ట్రా మోడరన్ లుక్స్:
ప్రఖ్యాత డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా రూపొందించిన మెరిసే సిల్వర్ సీక్విన్డ్ కాక్‌టైల్ గౌనులో ప్రజ్ఞా జైస్వాల్ అప్సరసలా మెరిసిపోయింది. ఇక వన్-షోల్డర్ నెక్‌లైన్, నడుము భాగంలో హైలైట్ అయ్యే డేరింగ్ సైడ్ కట్-అవుట్‌తో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్ ఆమెకు రాయల్ అండ్ గ్లామరస్ టచ్ ఇచ్చింది. ఇక ఫ్రింజ్ హెవీ హై-స్లిట్ డిజైన్‌తో కూడిన ఈ డ్రెస్ ఆమె ఫిగర్‌ను మరింత పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసింది.
హాట్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా:
స్టైలిస్ట్ తనీషా, లైమ్‌లైట్ డైమండ్స్ జ్యువెలరీ మ్యాచింగ్‌తో ఫరా చేసిన డిజైనర్ మేకప్‌లో ప్రజ్ఞా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆమె గ్లామర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఇక నటనతో పాటు గ్లామర్‌లోనూ పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న ఈ భామ మరిన్ని ప్రాజెక్టులతో టాలీవుడ్‌ను ఏలడానికి సిద్ధమవుతోంది.
సరికొత్త గ్లామరస్ రోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజ్ఞా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఆమె వర్సటైలిటీ స్పష్టంగా తెలుస్తోంది. ఇక వెండితెరపై నటనతో అలరిస్తూనే, సోషల్ మీడియాలో గ్లామర్ బాంబ్‌గా మారిన ఈ సుందరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రాజెక్ట్‌లతో మురిపిస్తుందో వేచి చూడాలి.