• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ డుంకిని కొడితే.....

ప్రభాస్ డుంకిని కొడితే.. లెక్క మారిపోద్ది!

| ప్రభాస్ నుంచి రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు

By - Tupaki Desk
Update: 2023-11-18 05:53 GMT

ప్రభాస్ నుంచి రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కేజీఎఫ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను రూపొందిస్తూ ఉండడం తో అంచనాల స్థాయి అంతకంతకు పెరుగుతూనే ఉంది.

సినిమాపై మధ్య మధ్యలో కొన్ని నెగటివ్ వార్తలు వచ్చినప్పటికీ కూడా అసలు ఏ మాత్రం బజ్ అయితే తగ్గలేదు. తప్పకుండా సినిమా అంతకుమించి అనేలా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ లో ఒక నమ్మకం అయితే ఉన్నారు. అసలే ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక్క సరైన సక్సెస్ కూడా చూడలేదు. కాబట్టి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ ఫైర్ కాకూడదు అనే కోరుకుంటున్నారు.

ఇక పక్కా ప్రణాళికతోనే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అయితే పోటీగా సలార్ అదే సమయంలో షారుఖ్ డుంకి సినిమా కూడా రాబోతోంది. అసలే వరుసగా పఠాన్ జవాన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ రికార్డులను సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు.

దానికి తోడు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజ్ కుమార్ హీరాని ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పీకే సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు అతని మేకింగ్ విధానంలో ఎమోషన్ క్లిక్ అయితే కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమా కూడా తక్కువేమీ కాదు.

ఈ సినిమా కూడా తప్పకుండా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేవలం టాక్ బట్టి మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ గనుక డుంకిని ఢీ కొట్టి పై చేయి సాధిస్తే మాత్రం ప్రభాస్ రేంజ్ బాహుబలి కంటే పదింతలు పెరుగుతుంది అని చెప్పవచ్చు. సాధారణ సినిమాలతో పోటీ పడడం కంటే ఇలాంటి బలమైన సినిమాతో పోటీ పడితే ఆ లెక్క వేరే విధంగా ఉంటుంది. కాబట్టి సలార్ సినిమాతో ప్రభాస్ కు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    
  • Salaarmovie 
  • Prabhas 
  • Prashanthneel 
  • Shahrukhkhan 
  • Dunkimovie 
  • Rajkumarhirani 
  • Filmindustry 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS