• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ఫుల్ కాన్సెప్టుతో...

పవర్ఫుల్ కాన్సెప్టుతో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

| డిసెంబర్ 22న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది.

By - Tupaki Desk
Update: 2023-11-19 10:28 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ గా ఉన్నాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోలైన ఖాన్ త్రయం కూడా ప్రభాస్ కి పోటీగా సినిమాలు రిలీజ్ చేయడానికి కాస్తా సంకోచిస్తున్నారు. అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి సాలిడ్ మూవీ మాత్రం ఇప్పటి వరకు పడలేదు.

మూడు సినిమాలు రిలీజ్ అయిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయిపోవడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. డిసెంబర్ 22న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సలార్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నుంచి వస్తోన్న సినిమా ఇదే.

అందుకే దేశ వ్యాప్తంగా సినిమాపై హైప్ ఉంది. సలార్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి మూవీ వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. దాంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలాక్స్ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఇంకా అఫీషియల్ గా ఈ సినిమాపై ఎలాంటి ప్రకటన రాలేదు. కాని ఇప్పటికే హను స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ జరుగుతుందంట. అదే జరిగితే కచ్చితంగా హను, ప్రభాస్ మూవీ మరో క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

కల్కి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కథలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకి రీచ్ అయ్యే పాయింట్ లతో చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ తో అనుకుంటున్న సినిమాకి సెకండ్ వరల్డ్ వర్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Prabhas 
  • Salaar 
  • Prashantneel 
  • Nagashwin 
  • Kalki 
  • Hanuraghavapudi 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS