ప్రభాస్ 'కన్నప్ప'.. ఎంత వేగంగా అంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా ఉన్నాడు.

Update: 2024-05-09 06:26 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా ఉన్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా సినిమాకి అతని మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతోంది. 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉంటుందంట. మైత్రీ మూవీ మేకర్స్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా బడ్జెట్ కూడా 400 కోట్లకి పైనే అని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ స్థాయిలో ఇండియన్ వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్, మంచు విష్ణు లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్పలో కీలక పాత్ర చేస్తున్నాడు.

నందీశ్వరుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే ఒక టాక్ గట్టిగా వైరల్ అయ్యింది. ప్రభాస్ కన్నప్పలో నటిస్తూ ఉండటంతో ఈ చిత్రం చుట్టూ భారీ హైప్ నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో కూడా స్టార్ట్ చేసేశారు. మూవీలో తన పాత్ర కోసం ప్రభాస్ కేవలం 3 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాత్ర నిడివి చాలా తక్కువ ఉండబోతోందట. ప్రభాస్ పై ఉండే ఆ ఒక్క సీన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

Read more!

వీలైనంత త్వరగా జెట్ స్పీడ్ లోనే ప్రభాస్ కన్నప్ప సీన్స్ ను ఫినిష్ చేసి అనంతరం రాజా సాబ్ గ్రౌండ్ లోకి దుకాబోతున్నాడు. ఇక అనంతరం కల్కి ప్రమోషన్స్ లో బిజీ అవ్వాల్సి ఉంది. కన్నప్ప లో మొదట మహాశివుడి పాత్ర అని కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు నందీశ్వరిడి పాత్ర కాబట్టి కథపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలుస్తోంది.

మహాభారతం సీరియల్ ని హిందీలో తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, మంచు మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇంత భారీ క్యాస్ట్ తో వస్తున్న మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News