కన్నప్ప.. నందీశ్వరుడి ఆగమనం!

చిత్రంలో నందీశ్వరుడి రోల్ కు మంచి ఇంపాక్ట్ కూడా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్.. నందీశ్వరుడిగా ఎలా ఉంటారో వేచి చూడాలి.

Update: 2024-05-09 12:01 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మోహన్ బాబు.. అగ్ర నటీనటులను రంగంలోకి దింపుతున్నారు.

 

అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాలో నటించే స్టార్ యాక్టర్లు.. తమ రోల్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీలో ఆయన శివుడిగా కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. శివుడి పాత్రలో ముందు ప్రభాస్ నటిస్తారని వార్తలు వచ్చినా.. మళ్ళీ ఆ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ మూవీలో ప్రభాస్.. శివ భక్తుడు అయిన నందీశ్వరుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కన్నప్ప సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

అయితే పోస్టర్ లో ప్రభాస్‌ ముఖాన్ని రివీల్‌ చేయలేదు. కాళ్లను మాత్రమే చూపించారు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారగా.. గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. కన్నప్ప సినిమా కోసం మూడు రోజులే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ జెట్ స్పీడ్ లో కన్నప్పకు సంబంధించిన ఆయన భాగాన్ని కంప్లీట్ చేస్తున్నారట. ఇక ప్రభాస్ ఈ మూవీలో భాగమవ్వడంతో మంచి హైప్ నెలకొంది. చిత్రంలో నందీశ్వరుడి రోల్ కు మంచి ఇంపాక్ట్ కూడా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ప్రభాస్.. నందీశ్వరుడిగా ఎలా ఉంటారో వేచి చూడాలి.

Read more!

కన్నప్ప సినిమా నిర్మిస్తూనే.. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్‌ లాల్‌, శివ రాజ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, మధుబాల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్ తో పాటు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2024లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News