• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక.....

ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక.. మారుతి తీరుస్తాడా

| సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభాస్ ని మళ్ళీ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ లుక్ లో చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెబుతూ వస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-12-03 11:52 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గత కొంతకాలంగా ఓ కోరిక బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే.. తమ అభిమాన హీరోని వింటేజ్ లుక్ లో చూడడమే. ఈ మధ్యకాలంలో ప్రభాస్ లుక్స్ పరంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ లుక్స్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఆదిపురుష్ మూవీ టైంలో అయితే ఇది కాస్త ఎక్కువే కనిపించింది.

ఒకానొక దశలో ప్రభాస్ సీజి లుక్ అంటూ ఎంత రచ్చ చేసుజారో చెప్పనక్కర్లేదు. ఇదే విషయంలో చాలాకాలంగా ఫ్యాన్స్ రిగ్రేట్ ఫీలవుతున్నారు. మళ్లీ ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో చూడాలని కోరుకుంటున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభాస్ ని మళ్ళీ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ లుక్ లో చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెబుతూ వస్తున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం అది తప్పించి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల్లో అతని లుక్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశ పరుస్తూ వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. కల్కి, మారుతి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా 'కల్కి' నుంచి గ్లిమ్స్ వీడియో బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలోనూ ప్రభాస్ లుక్స్ పరంగా ఆకట్టుకోలేకపోయాడని టాక్ వచ్చింది.

అయితే ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్ కి పులిస్టాప్ పడాలన్నా, ఫ్యాన్స్ కోరిక తీరాలన్న అది మారుతి సినిమా తోనే సాధ్యమవుతుంది. ఇప్పటివరకు మారుతి - ప్రభాస్ సినిమా నుంచి బయటికి వచ్చిన కొన్ని అన్ అఫీషియల్ పిక్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ పిక్స్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ తో కనిపించాడు. ప్రభాస్ తో మారుతి తీసేది ఓ హారర్ కామెడీ డ్రామా. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలో మారుతి ప్రభాస్ ని మాక్సిమం బెస్ట్ లుక్స్ తోనే స్క్రీన్ పై ప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

దానికి తోడు సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అంటే ఇందులో రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతోంది. మరి మారుతి డార్లింగ్ ఫ్యాన్స్ కోరికను తీరుస్తూ వింటేజ్ ప్రభాస్ ని తన సినిమాతో అయినా చూపిస్తాడేమో చూడాలి. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Prabhas 
  • Adipurush 
  • Maruthiraja 
  • Salaar 
  • Kalki 
  • Malvikamohanan 
  • Nidhiaggarwal 
  • Riddhikumar 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS