రాజా సాబ్.. టికెట్ రేట్ల పెంపుకి గ్రీన్ సిగ్నల్!

కేవలం స్పెషల్ షోలే కాదు, రిలీజ్ అయిన మొదటి పది రోజుల పాటు సాధారణ టికెట్ రేట్ల మీద కూడా భారీ పెంపునకు అనుమతి దక్కింది.;

Update: 2026-01-07 12:52 GMT

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ‘ది రాజా సాబ్’ రిలీజ్ కు ఏపీ ప్రభుత్వం నుంచి మేకర్స్ కు భారీ గిఫ్ట్ అందింది. జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దీంతో థియేటర్ల దగ్గర ప్రభాస్ మాస్ ర్యాంపేజ్ మొదలవ్వడానికి ఇక లైన్ క్లియర్ అయిపోయింది.

 

అసలు ఈ జీవో లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే.. జనవరి 8వ తేదీన అర్ధరాత్రి 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఒక స్పెషల్ షో వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను ఏకంగా 1000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అంటే డార్లింగ్ క్రేజ్ కు తగ్గట్టుగా ఓపెనింగ్స్ లోనే రికార్డులు తిరగరాయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పక్కా స్కెచ్ వేసిందని అర్థమవుతోంది.

కేవలం స్పెషల్ షోలే కాదు, రిలీజ్ అయిన మొదటి పది రోజుల పాటు సాధారణ టికెట్ రేట్ల మీద కూడా భారీ పెంపునకు అనుమతి దక్కింది. సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్ మీద 150 రూపాయలు, మల్టీప్లెక్సులలో 200 రూపాయల వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చు. సంక్రాంతి సీజన్ లో పది రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉండటం నిర్మాతలకు అతిపెద్ద అడ్వాంటేజ్.

ప్రభాస్ మార్కెట్ రేంజ్ కు, ఈ సినిమా మీద ఉన్న హైప్ కు ఈ రేట్ల పెంపు అనేది కలెక్షన్ల పరంగా ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది. హారర్ ఫాంటసీ జానర్ లో వస్తున్న ఈ సినిమాను దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. కాబట్టి ఇలాంటి రేట్ల పెంపు ఉంటేనే బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ తో సగం బడ్జెట్ రికవరీ అయిపోయిన ఈ సినిమాకి, ఇప్పుడు ఈ జీవో మరో బిగ్ బూస్ట్ లాంటిది.

ఇక తెలంగాణ రేట్ల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ డ్యాన్స్ లు, మారుతి మార్క్ కామెడీ చూడటానికి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కు ఇప్పుడు టికెట్ల బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అన్నదే తదుపరి ఇంట్రెస్ట్. జనవరి 9న ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ మొదలుపెట్టబోతున్నాడు. ఈ రేట్ల పెంపు వల్ల వచ్చే కలెక్షన్లు టాలీవుడ్ లో కొత్త రికార్డులను సెట్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ హారర్ ఫాంటసీ మూవీ ప్రభాస్ కెరీర్ లో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News