ప్రభాస్‌తో 'నాటు నాటు' మాస్టర్.. జక్కన్న మెచ్చిన 'మ్యాడ్ గయ్' కథేంటి?

'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రతీ సినిమా వందల కోట్ల బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు.;

Update: 2025-11-15 07:22 GMT

'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన ప్రతీ సినిమా వందల కోట్ల బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. అలాంటిది, ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే, ఆ డైరెక్టర్ మరెవరో కాదు, 'నాటు నాటు' సాంగ్‌తో ఆస్కార్ గెలిచిన స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఒక డ్యాన్స్ మాస్టర్‌ను నమ్మి ప్రభాస్ అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

'సాహో' (సుజీత్), 'రాధే శ్యామ్' (రాధాకృష్ణ) వంటి సినిమాలతో ప్రభాస్ కొత్త, తక్కువ అనుభవం ఉన్న డైరెక్టర్లను నమ్మి చేతులు కాల్చుకున్నాడని ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మారుతి, హను రాఘవపూడి లైన్‌లో ఉండగానే, ఏకంగా ఒక కొరియోగ్రాఫర్‌తో సినిమా ఏంటని కొందరు అప్సెట్ అవుతున్నారు. కానీ, ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తో సంతోషపడే వాళ్లు కూడా ఉన్నారు. దానికి కారణం, ప్రేమ్ రక్షిత్ వెనుక ఉన్న అసలైన బలం.

ఆ బలమే గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. జక్కన్నకు ప్రేమ్ రక్షిత్‌పై ఉన్న నమ్మకం మామూలుది కాదు. గతంలో 'RRR', 'బాహుబలి' ఈవెంట్లలో రాజమౌళి ఓపెన్‌గానే చెప్పారు. "నా మ్యాడ్ గయ్ ప్రేమ్ రక్షిత్. నేను కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతానేమో గానీ, అతను మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు" అని జక్కన్న స్వయంగా కితాబిచ్చారు. 'యమదొంగ' నుంచి 'RRR' వరకు తన ప్రతీ సినిమాలో ప్రేమ్ మార్క్ ఉండేలా చూసుకున్నారు.

ప్రేమ్ రక్షిత్ కేవలం డ్యాన్స్ మాస్టర్ మాత్రమే కాదు, అంతకుమించిన టెక్నీషియన్ అని కూడా జక్కన్నే చెప్పారు. "అతను పాటలే కాదు, యాక్షన్ సీక్వెన్సులు కూడా కంపోజ్ చేస్తాడు. 'బాహుబలి 2'లో ప్రభాస్, అనుష్క కలిసి బాణాలు వేసే ఆ 'ఆరో ఫైట్' మొత్తం కంపోజ్ చేసింది ప్రేమ్ రక్షితే" అని రాజమౌళి ఆనాడే రివీల్ చేశారు. అంటే, ఒక డ్యాన్స్ మాస్టర్‌లోని ఫైట్ మాస్టర్‌ను, ఒక కథకుడిని జక్కన్న ఎప్పుడో గుర్తించారు.

ఈ లెక్కన చూస్తే, ప్రభాస్ తీసుకుంటున్నది బ్లైండ్ రిస్క్ కాదు, ఒక పక్కా కాలిక్యులేటెడ్ స్టెప్. తనతో 'ఛత్రపతి' (2005) రోజుల నుంచి పనిచేస్తున్న ప్రేమ్ టాలెంట్ ఏంటో, ముఖ్యంగా 'బాహుబలి'లో అతని యాక్షన్ కంపోజిషన్ స్కిల్స్ ఏంటో ప్రభాస్‌కు బాగా తెలుసు. గతంలో 'రెబల్' కోసం కొరియోగ్రాఫర్ లారెన్స్‌తో కూడా ప్రభాస్ పనిచేశారు. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ ఒక బలమైన కథ చెప్పి ప్రభాస్‌ను వెంటనే ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి, ఇది ఒక యానిమేషన్ సినిమా అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది, కానీ దీనిపై స్పష్టత లేదు. మరీ దీనిపై ఎప్పుడూ క్లారిటీ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News