సహాయంలో ముందుండే రెబెల్ స్టార్ ప్రభాస్!
గ్లోబల్ స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్ బాహ్య ప్రపంచంలో మాత్రం ఎంతో సైలెంట్‌గా? సింపుల్‌గా కనిపిస్తారు. పబ్లిసిటీకి, ఆర్భాటాలకు వీలైనంత దూరంగా ఉండే మనస్తత్వం అతడిది.
గ్లోబల్ స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్ బాహ్య ప్రపంచంలో మాత్రం ఎంతో సైలెంట్‌గా? సింపుల్‌గా కనిపిస్తారు. పబ్లిసిటీకి, ఆర్భాటాలకు వీలైనంత దూరంగా ఉండే మనస్తత్వం అతడిది. అయితే కెమెరా వెనుక ఆయనకున్న బంగారు మనసు .. తోటివారికి సాయం చేసే గుణం ప్రభాస్‌ను అందరి కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ముఖ్యంగా తనను నమ్ముకున్న వారి కోసం.. పరిశ్రమలోని పాత పరిచయాల కోసం ..చిన్న బడ్జెట్ చిత్రాల ప్రమోషన్ల కోసం ఆయన ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఇటీవలి కాలంలో ప్రభాస్ చేసిన కొన్ని చిత్ర ప్రమోషన్లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
`కల్కి` వంటి విజువల్ వండర్‌ను అందించిన దర్శకుడు నాగ అశ్విన్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయనకు సంబంధించిన `సింగీతం` సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఇచ్చిన అద్భుతమైన ఇంటర్వ్యూ సోషల్ మీడియిఆలో వైరల్ అయింది. ఒక పాన్-ఇండియా స్టార్ హీరో.. ఒక చిన్న ప్రత్యేకమైన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం కోసం సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇవ్వడం ఆ ప్రాజెక్ట్‌కు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక స్నేహితుల విషయంలో ప్రభాస్ ఎంత బలంగా నిలబడతారు అన్నది చెప్పాల్సినపనిలేదు. అలాంటి ఎన్నో సినిమాలను తన చేతుల మీదుగా ప్రమోట్ చేసారు.
కెరీర్ ఆరంభంలో తనకు లైఫ్ ఇచ్చిన పాత పరిచయాలకు కూడా అంతే విలువ ఇస్తారు. తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన `వర్షం` చిత్ర దర్శకుడు శోభన్ కుటుంబంపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. శోభన్ అకాల మరణం తర్వాత ఆయన వారసుడిగా టాలీవుడ్‌లో రాణిస్తున్న యంగ్ హీరో సంతోష్ శోభన్‌కు ప్రభాస్ ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా సంతోష్ నటించిన `కపుల్ ఫ్రెండ్లీ` సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ చిత్రానికి ప్రేక్షకులల్లో మంచి బజ్ ఏర్పడేలా సాయపడ్డారు.
మరోవైపు సొంత బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై ప్రభాస్‌కు ఉన్న అటాచ్‌మెంట్ ప్రత్యేకమైనది. తన ప్రాణస్నేహితులు నడిపే ఈ బ్యానర్ నుండి వచ్చే చిన్న చిత్రాలను కూడా ఆయన ప్రమోట్ చేయడానికి వెనుకాడరు. చిన్న చిత్రాలకు థియేట్రికల్ మార్కెట్‌లో ఎలాంటి మైలేజ్ అవసరమో అలాంటి భారీ ఓపెనింగ్ హైప్‌ను సృష్టించారు. ఇంకా తెలుగు చిత్రసీమలో ప్రతి వారం ఎన్నో చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. సరైన పబ్లిసిటీ లేక, ప్రేక్షకులకు రీచ్ కాలేక చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు పడుతుంటాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ నుంచి వచ్చే ఒక చిన్న ట్వీట్, వీడియో గ్లింప్స్, ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయా సినిమాల జాతకాన్నే మార్చేస్తున్నాయి. చిన్న చిత్రాలు బతికితేనే పరిశ్రమ బాగుంటుం దనే నినాదంతో ఆయన అనేకమంది యంగ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ప్రభాస్ అండగా మారుతున్నారు.
సహాయం చేయడంలోనూ.. స్నేహానికి విలువ ఇవ్వడంలోనూ పెదనాన్న కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ అక్షరాలా కొనసాగిస్తున్నారని ట్రేడ్ వర్గాలు కొనియాడుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే ఆయనను అభిమానులకు డార్లింగ్ గా మార్చేసింది. పాన్-ఇండియా సినిమాల షూటింగులతో నిరంతరం బిజీగా ఉన్నా? చిన్న సినిమాల మేకర్స్ అడగ్గానే కాదనకుండా సమయం కేటాయించే ప్రభాస్ మనస్తత్వం యువ తరం హీరోలకు గొప్ప రోల్ మోడల్ గా చెప్పొచ్చు.