ఆ విషయంలో రాజా సాబ్ టెన్షన్ ఫ్రీ
డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ తర్వాత సంక్రాంతి సీజన్ అయితే బావుంటుందని జనవరి 9కి వాయిదా వేశారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాల్లో ది రాజా సాబ్ కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాల్లేవు. ఇంకా చెప్పాలంటే మారుతితో సినిమా ఏంటని, ఈ సినిమాను ఆపేయమని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేశారు.
పోస్టర్లు, టీజర్ తో అంచనాలను పెంచేసిన మారుతి
కానీ ప్రభాస్ మాత్రం కంటెంట్‌ను, మారుతిని నమ్మి సినిమాను కంటిన్యూ చేశారు. మారుతి కూడా తనకు ప్రభాస్ పై ఉన్న ప్రేమను మాటల్లో కాదు, చేతల్లోనే చూపిస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే రాజా సాబ్ నుంచి పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ వచ్చాయో అప్పట్నుంచి రాజా సాబ్ పై విపరీతమైన బజ్ ఏర్పడింది. అందరూ రాజా సాబ్ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.
ఆఖరి దశలో రాజా సాబ్
వాస్తవానికైతే రాజా సాబ్ ఇప్పటికే రిలీజవాల్సింది కానీ మధ్యలో షూటింగ్ లేటవడం వల్ల సినిమా వాయిదా పడింది. డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న మేకర్స్ తర్వాత సంక్రాంతి సీజన్ అయితే బావుంటుందని జనవరి 9కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం ఒక్క ఫైటింగ్ సీన్ మాత్రమే పెండింగ్ ఉందని, ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ అయితే పూర్తైందని సమాచారం. మరో వారం రోజుల్లో ఆ మిగిలిన షూటింగ్ కూడా పూర్తవుతుందని, ఆ తర్వాత నుంచి చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను చూసుకోనుందని తెలుస్తోంది.
ప్రమోషన్స్ కు ఎక్కువ టైమ్ కేటాయించేలా ప్లాన్
కాగా మూవీ రిలీజ్ కు మరో రెండు నెలలుంది. వీఎఫ్ఎక్స్, సీజీ భారీగా అవసరమున్న సినిమా కావడంతో రెండు నెలలనేది ఎక్కువ సమయమేమీ కాదు. కానీ రాజా సాబ్ కు సంబంధించిన సీజీ వర్క్స్ కూడా చాలా వరకు పూర్తయ్యాయట. మధ్యలో షూటింగ్ కు బ్రేక్ వచ్చిన టైమ్ లో మారుతి ఆ పనుల్ని చేయించారని దీంతో ఇప్పుడు చిన్న చిన్న పనులే పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ఈ రెండు నెలల్ని రీరికార్డింగ్, మిక్సింగ్, ఎడిటింగ్ కు వాడి మిగిలిన టైమ్ ను ప్రమోషన్స్ కు కేటాయించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. సాధారణంగా ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ చెప్పిన రిలీజ్ డేట్ ను అందుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే, రాజా సాబ్ మొత్తం షూటింగ్ ను చాలా ముందుగానే పూర్తి చేసుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోతుంది. కామెడీ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.