ప్రభాస్ 'రాజా సాబ్'.. డ్యాన్స్ తోనే హైప్ పెంచేశాడుగా!

అదే సమయంలో నాచే నాచే పాట కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ముందు ప్రోమో రాగా.. రీసెంట్ గా మేకర్స్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.;

Update: 2026-01-06 06:55 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. మరికొన్ని రోజుల్లో ది రాజా సాబ్ మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా కామెడీ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ గా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఇప్పటికే రాజా సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అంచనాలను ఫుల్ గా పెంచేసింది. అదే సమయంలో నాచే నాచే పాట కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ముందు ప్రోమో రాగా.. రీసెంట్ గా మేకర్స్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ముందు నాచే నాచే ప్రోమో వచ్చినప్పుడే ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ మూవీ లవర్స్ ను విపరీతంగా అలరించింది. ఎనర్జిటిక్ బీట్ తో కంపోజ్ చేసిన ఆ పాట.. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అయిపోయింది. సాంగ్ లోని హుక్ స్టెప్.. సినీ ప్రియులను ఫిదా చేసేసింది.

నార్త్ మూవీ లవర్స్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. అన్నింటి కన్నా సాంగ్ లో ప్రభాస్‌ తో పాటు ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ డ్యాన్స్ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది చాలా అరుదైన విజువల్ కావడంతో.. సాంగ్ గ్రాండ్ ఫీలింగ్‌ ను ఇస్తోంది.

అదే సమయంలో విజువల్స్, భారీ సెట్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్ అన్నీ కలిసి పాటకు హై వాల్యూ తీసుకొచ్చాయి. ప్రభాస్ స్టెప్పులు చూస్తే ఆయనలోని మాస్ ఎనర్జీ మరోసారి బయట పడినట్టు కనిపించింది. అభిమానులు చాలా కాలంగా ఆయనను ఫుల్ ఫ్లెజ్డ్ డ్యాన్స్ మోడ్‌ లో చూడాలని ఎదురుచూస్తుండగా, ఆ కోరిక పాటతో నెరవేరింది.

ఇటీవల సినిమాల్లో స్వాగ్‌ తో నడిచిన ప్రభాస్, ఈసారి పూర్తిగా హై ఎనర్జీ డ్యాన్స్‌తో సందడి చేశారు. కొరియోగ్రఫీ కూడా ఆయన స్టైల్‌ కు తగ్గట్టుగా డిజైన్ చేయడంతో, ప్రతి స్టెప్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే.. యూత్ కు తెగ మెప్పించిందని చెప్పడంలో నో డౌట్.

ఏదేమైనా ఇప్పటికే నార్త్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ విషయంలో సాంగ్ తోనే హైప్ ఎక్కించేశారు. ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొననప్పటికీ.. నాచే నాచే పాటతో అందరి దృష్టిని ఆకర్షించారు. మరి నార్త్ లో రాజా సాబ్ తో డార్లింగ్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News