ప్రభాస్ హను.. ఆ టైటిల్ ఫిక్స్ అవ్వొచ్చా..!
హను సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. హను కి మ్యూజిక్ విషయంలో మంచి పట్టు ఉంది. అది తన మొదటి సినిమా నుంచి ప్రూవ్ చేస్తూ వచ్చాడు.;
రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక పీరియాడికల్ సినిమా వస్తుందని తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ రివీల్ టైం వచ్చింది. సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం మొదలు పెట్టిన మేకర్స్ గురువారం టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.
ఏ బెటాలియన్ హు వాక్స్ ఎలోన్..
ప్రభాస్ హను కాంబినేషన్ లో వస్తున్న సినిమాను ప్రీ లుక్ పోస్టర్స్ గా ఏ బెటాలియన్ హు వాక్స్ ఎలోన్ అన్నది చెబుతూ మొన్న తుపాకీలతో ఒక పోస్తర్ వదలగా ఈరోజు ఒక వాకింగ్ చేస్తున్న స్టిల్ ఒకటి వదిలారు. కచ్చితంగా ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ నే పెడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వస్తున్న లీక్స్. ఐతే ఫౌజీ ప్రభాస్ సినిమాల్లో చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు.
హను రాఘవపూడి సినిమాల్లో కథ కథనాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు అతను ఎమోషనల్ కంటెంట్ విషయంలో అంచనాలను అందుకున్నాడు. ఐతే అంతకుముందు ఫలితాలు కాస్త తారుమారైనా కూడా ఫైనల్ గా సీతారామం తో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రభాస్ తో హను చేస్తున్న భారీ సినిమా బజ్ ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో వార్ సీక్వెన్స్ తో పాటు సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయట.
ప్రభాస్ ఫౌజీతో హను ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ ఇంపాక్ట్..
హను సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. హను కి మ్యూజిక్ విషయంలో మంచి పట్టు ఉంది. అది తన మొదటి సినిమా నుంచి ప్రూవ్ చేస్తూ వచ్చాడు. ప్రభాస్ ఫౌజీతో హను ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ ఇంపాక్ట్ చూపించబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. ఐతే ఫౌజీ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటుందని అంటున్నారు.
ప్రభాస్ రాజా సాబ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసుకోగా ఫౌజీ సినిమాను నెక్స్ట్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఐతే హను ప్రభాస్ సినిమా ఫౌజీనా లేదా మరో టైటిలా అన్నది రేపు రాబోతున్న అప్డేట్ తో క్లారిటీ వచ్చేస్తుంది.