ప్రభాస్ జంధ్యం వెనుక ఇంత కథ ఉందా?
ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ నుంచి విడుదలైన లేటెస్ట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ నుంచి విడుదలైన లేటెస్ట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పోస్టర్ లో ప్రభాస్ మెడలో జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సాధారణంగా యుద్ధభూమిలో గన్ పట్టుకున్న సైనికుడి లుక్ తోపాటు జంధ్యం కనిపించడం వెనుక ఏదైనా ప్రత్యేక కథ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు చేసినప్పటికీ, ఆదిపురుష్ లో రాజ వంశీయుడిగా మినహాయించి జంధ్యంతో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో దర్శకుడు హను రాఘవపూడి హీరో రోల్ కు దేశభక్తి కథకు మించి మరో బ్యాక్ డ్రాప్ ను యాడ్ చేసినట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే సినిమా పోస్టర్లలో కనిపించిన కొన్ని హింట్స్ కూడా ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ముఖ్యంగా మహాభారతానికి సంబంధించిన శ్లోకాలు యూజ్ చేయడం, "అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది" అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో తమ అసలు విషయాన్ని దాచుకున్నట్లు, ఫౌజీలో ప్రభాస్ పాత్ర కూడా ఏదో సీక్రెట్ టార్గెట్ గా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కర్ణుడి కథతో కూడా ఆ రోల్ కు సంబంధం ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.
పురాణాల ప్రకారం, కర్ణుడు అన్ని విద్యలను నేర్చుకునేందుకు తనను తాను వేరేగా పరిచయం చేసుకుంటాడు. అదే తరహాలో సినిమాలో ప్రభాస్ రోల్ కూడా తన అసలు పర్సనాలిటీ దాచి శత్రువుల మధ్యకు వెళ్లే మిషన్ లో భాగమవుతుందా అనే చర్చ నడుస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సినిమా కథ 1930-40ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ కాలాన్ని తలపించే ఎన్విరాన్మెంట్ ఇందులో కనిపించనుంది. ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి దేశం కోసం పోరాట యోధుడిగా మారే ప్రయాణాన్ని దర్శకుడు చూపించే అవకాశం ఉందని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అందుకే జంధ్యం కేవలం ఒక ఆర్నమెంట్ లా కాకుండా, రోల్ బ్యాక్ డ్రాప్ ను, అతని ఆలోచనా ప్రపంచాన్ని సూచించే అంశంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ పోస్టర్ లో ప్రభాస్ రక్తపు మరకలతో, చుట్టూ మృతదేహాల మధ్య గన్ పట్టుకుని కూర్చున్న తీరు కూడా కథపై మరింత ఉత్కంఠ పెంచింది.
ఒకవైపు ధర్మాన్ని సూచించే జంధ్యం, మరోవైపు యుద్ధాన్ని సూచించే తుపాకీ కనిపించడం పాత్రలోని డెప్త్ ను చూపిస్తోందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే పోస్టర్ తోనే ఇంత చర్చ జరుగుతుండటంతో, త్వరలో వచ్చే టీజర్ లో ప్రభాస్ జంధ్యం వెనుక ఉన్న అసలు కథపై మరిన్ని క్లూస్ దొరికే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.