స్టార్ హీరోయిన్ డాడీ తొమ్మిది రోజులు నీళ్ల మీదే!
ఇలా చేయడం కొత్తలో కష్టమైనా తర్వాత అలవాటుగా మారడంతో ఎలాంటి ఇబ్బంది పడలేదు.;
సెలబ్రిటీలు డైటింగ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. న్యూట్రిషన్లు..డైటీషన్ల సూచనలు..సలహాల మేరకు ఫిట్ నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. శరీరానికి అవసరమైన పోషక పదార్దాలు మోతాదులో తీసుకుంటారు. ఇనిస్టెంట్ గా వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ లో భారీ మార్పులే ఉంటాయి. ఉపవాసాలు సైతం చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ సంవత్సరంలో ఏకంగా 18 రోజులు కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుంటుంది. ఇంకెలాంటి పోషకాలు తీసుకోదు. ఇలా ఏడాదికి రెండుసార్లు చేస్తోంది.
ఇలా చేయడం కొత్తలో కష్టమైనా తర్వాత అలవాటుగా మారడంతో ఎలాంటి ఇబ్బంది పడలేదు. కానీ ఆరోగ్య పరంగా మంచి ఫలితాలుంటాయని నర్గీస్ గట్టిగా చెప్పే మాట. తాజాగా నర్గీస్ తర్వాత అలాంటి ఉపవాసం చేసే మరో వ్యక్తి దొరికేసారు. ఆయన ఎవరో కాదు ముంబై బ్యూటీ పూజాహెగ్డే తండ్రి. పెద్దాయన తొమ్మిది రోజుల పాటు కేవలం నీరు మీదనే ఉంటారుట. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉదయం నుంచి రాత్రి పడుకునే వారకూ తొమ్మిది రోజుల పాటు నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటారుట. నిద్ర సమయంలో కడుపు ఖాళీగా అనిపించినా మళ్లీ నీళ్లు తప్పా ఇంకెలాంటి పదర్దాలు తీసుకోరుట.
ఏడాదికి ఒకసారి ఇలా చేయడం ఎంతో కాలంగా ఉన్న అలవాటు గా పేర్కోంది. పూజాహెగ్డే కూడా ఏడాదికి రెండు సార్లు తప్పకుండా ఉపవాసం ఉంటుందిట. 'అంగారిక సంకిష్ట చతుర్దశి' చి, మహాశివరాత్రికి తప్పకుండా ఉపవాసంలోనే ఉంటుందిట. ఆ సమయంలో తన షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఉపవాసం చేస్తానంది. ఏడాదిలో రెండు సార్లు ఇలా చేయడం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందంది. సినిమాల్లోకి రాకముందు ఎక్కువగా ఉపవాసాలు చేసేదిట. ఫీల్డ్ కి వచ్చిన తర్వాత అంత సమయం దొరకకపోవడంతో? అప్పుడప్పుడు తప్ప అన్ని సందర్భాల్లో ఉపవాసం సాధ్యం కావడం లేదంది.
ప్రస్తుతం పూజాహెగ్డే సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన 'కూలీ' చిత్రంలో మోనికా పాటతో అలరించింది. కానీ సినిమా వైఫల్యంతో పూజాహెగ్డే ఎఫెర్ట్ అంతా వృద్ధాగానే మిగిలిపోయింది. ప్రస్తుతం `జననాయగన్`, `కాంచన 4` లో నటిస్తోంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ లో `ఏ జవానీ తో ఇష్క్ హోనా హై`లో నటిస్తోంది.