పూజా మృణాల్.. జాన్వీ మూవీని డామినేట్ చేసినట్లేనా?

ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే, పెద్దిలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించారు. గ్రామీణ లుక్‌ లో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

Update: 2026-06-06 04:34 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన పెద్ది మూవీ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా.. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఆ సినిమా, బాలీవుడ్ మార్కెట్‌ లోనూ దృష్టి ఆకర్షించింది.

అయితే పెద్ది హిందీ వెర్షన్ తొలి రోజు సుమారు రూ.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ క్రేజ్, సినిమా ప్రమోషన్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్ సాలిడ్ ఓపెనింగ్స్‌ కు ప్రధాన కారణాలుగా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే పెద్ది విడుదలైన మరుసటి రోజే బాలీవుడ్‌ లో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై జూన్ 5న రిలీజైంది.

దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రం తొలి రోజు సుమారు రూ.7.5 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, నిర్మాతలు 50 శాతం వరకు టికెట్ ధరలపై డిస్కెంట్ ప్రకటించారు. అదే సమయంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌ గ్లామర్, వారి స్క్రీన్ ప్రెజెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే, పెద్దిలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించారు. గ్రామీణ లుక్‌ లో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. అయితే, సినిమాలో ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో స్కోప్ లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కథలో కీలకంగా నిలవాల్సిన పాత్ర కేవలం గ్లామర్ పరిమితంగానే మిగిలిపోయిందని కొందరు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, హై జవానీ తో ఇష్క్ హోనా హైలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇద్దరికీ కథలో మంచి స్క్రీన్ స్పేస్ లభించిందని టాక్ వినిపిస్తోంది. వారి రోల్స్ ఎంటర్టైనింగ్ గా ఉండడంతోపాటు ప్రేక్షకులను ఆకర్షించేలా డిజైన్ చేయడంతో ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఆ రెండు చిత్రాలను కంపేరిజన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పెద్ది ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కాగా, హై జవానీ తో ఇష్క్ హోనా హై కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

అయినప్పటికీ బాలీవుడ్ బాక్సాఫీస్‌లో తొలి రోజు వసూళ్ల పరంగా చూస్తే, పూజా హెగ్డే- మృణాల్ ఠాకూర్ జోడీ నటించిన చిత్రం.. జాన్వీ కపూర్ నటించిన పెద్ది హిందీ వెర్షన్ కంటే మెరుగైన ఓపెనింగ్స్ సాధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఓపెనింగ్స్ పరంగా పూజా, మృణాల్ గ్లామర్ ట్రీట్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించినట్టు కనిపిస్తోంది. అయితే లాంగ్ రన్ లో ఏ చిత్రం స్టేబుల్ వసూళ్లు సాధిస్తుందో రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

Tags:    

Similar News