మాటలతో కాదు ఆటతోనే.. పెద్ది ట్రైలర్ ఎలా ఉందంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది మూవీ.. గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది మూవీ.. గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో బజ్ తీసుకొచ్చాయి. అదే సమయంలో వరల్డ్ వైడ్ గా సినిమా జూన్ 4న సినిమా రిలీజ్ కానుండగా.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, మూవీ మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ట్రైలర్ ను తీసుకొచ్చారు.
ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ సెంటర్ లో లాంచింగ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైన్ సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవ్వగా.. ఆపండి ఎమర్జెన్సీ అంటూ చెబుతారు. ఇక్కడ ఏ కుర్రాడికైనా ఫేవరెట్ గేమ్ మారుతుంది కానీ.. ఫేవరెట్ ప్లేయర్ మారడం లేదు..పెద్ది ఏ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా డైలాగ్ రాగా.. అంటూ చరణ్ క్రికెటర్ గా ఎంట్రీ ఇస్తారుు. ఆ తర్వాత రెజ్లర్ గా కనిపించారు. ఆటే నా పొగరు అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
ఆకాశం నుంచి చుక్కలు పడతాయంటారుగా అని చరణ్ చెబుతుంటే.. జాన్వీ కపూర్ జీప్ పై ఎంట్రీ ఇచ్చారు. ఊర మాస్ లుక్ లో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకుంటున్నారు. నాకు ఆట గెలవడం కాదు.. బతకడం కావాలంటూ శివరాజ్ కుమార్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆ తర్వాత మిగతా పాత్రలు రివీల్ చేయగా.. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ తో చరణ్ అదరగొట్టారు. మాటలతో కాదు.. ఆటతోనే.. అంటూ ఛాలెంజ్ విసరడం హైలెట్ గా నిలిచింది. మీరందరూ ఆడానుకుంటున్నారు.. కానీ పోరాడాను సర్ అంటూ చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. చివర్లో క్రికెట్ షాట్, రెజ్లర్ ఫీట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఓవరాల్ గా చరణ్.. తన పాత్రలో ఒదిగిపోయారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తన యాక్టింగ్ తో దుమ్మురేపారు. జాన్వీ కపూర్ తన లుక్స్ తోపాటు డైలాగ్ టైమింగ్ తో మెప్పించారు. మిగతా క్యాస్టింగ్ కూడా తమదైన యాక్టింగ్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపాటు యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నారు. ఎడిటింగ్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. బుచ్చిబాబు తన మేకింగ్ తో మెప్పించేలా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ కట్ తో సినిమాపై హైప్ పెంచేలా ఉంది.
సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తుండగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఏదేమైనా టైలర్ అందరినీ ఆకట్టుకోగా.. పెద్ది సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.