థియేట‌ర్‌లో ఈల‌లు.. ఊరంతా ట‌పాసులు.. ఉపాస‌న ఒక‌టే సంబ‌రాలు!

పెద్ది స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వ‌చ్చిన `పెద్ది` చిత్రం థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది.

Update: 2026-06-04 18:12 GMT

పెద్ది స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరుకున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వ‌చ్చిన `పెద్ది` చిత్రం థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తుండటంతో స‌క్సెస్ మానియా ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఈ భారీ విజయానందాన్ని సెల‌బ్రేట్ చేస్తూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మెగా అభిమానులతో కలిసి గ్రాండ్‌గా సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి... భారీగా టపాసులు పేలుస్తూ ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు మహిళలు సినిమాకు వస్తున్న భారీ కలెక్షన్లు చరణ్ నటనకు వస్తున్న క్రేజ్ చూసి ఉపాసన, రామ్ చరణ్‌లకు గుమ్మడికాయలతో ఘనంగా దిష్టి తీయడం విశేషం.

అంతకుముందు ఉపాసన కొణిదెల థియేటర్లో `పెద్ది` సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. వెండితెరపై తన భర్త రామ్ చరణ్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన అఖాడా ఫైట్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వగానే ఉపాసన థియేటర్లో సీట్లో నుండి లేచి నిలబడి గట్టిగా ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ హంగామా చేశారు. థియేటర్ లోపల ఉపాసన ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా చూసిన అనంతరం తన ఇన్‌స్టాలో ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. రామ్ చరణ్‌ను ట్యాగ్ చేసి `కిల్డ్ ఇట్` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు ప‌లు జాతీయ మీడియాలు ఈ చిత్రానికి మంచి రేటింగ్ ఇచ్చి ప్రశంసల జల్లు కురిపించాయి. కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నా.. `పెద్ది` సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న సామాజిక సందేశం, కథలోని ప్రామాణికత ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకున్నాయ‌ని రాసాయి. కమర్షియల్ సినిమాల్లో సాధారణంగా సీరియస్ పాయింట్లను పక్కనబెడతారని కానీ బుచ్చిబాబు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన సమస్యను కథకు కేంద్ర బిందువుగా మార్చారని కొనియాడారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని, అభిమానులకు వినోదంతో పాటు ఎమోషనల్ రైడ్‌ను ఇచ్చే ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ `పెద్ది` అని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి.

స్వ‌ర‌మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన విజువల్స్ వెండితెరపై ఒక దృశ్యకావ్యంలా నిలిచాయి. రామ్ చరణ్ రగ్గడ్ లుక్, ఎమోషనల్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



Tags:    

Similar News