పెద్ది కోసం మరో స్టార్ ను రంగంలోకి దింపిన బుచ్చిబాబు
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.;
గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ షాట్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పెద్దిపై అందరికీ అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న పెద్ద
నెక్ట్స్ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ కానున్న భారీ సినిమాల్లో పెద్ది కూడా ఒకటి. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుచ్చిబాబు ఆల్రెడీ అన్నీ ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంతో ఈ షూటింగ్ ఎక్కడా ఎలాంటి అంతరాయల్లేకుండా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ భాగమైన విషయం తెలిసిందే.
అప్పుడు బాలయ్యతో.. ఇప్పుడు చరణ్ తో..
ఆల్రెడీ కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్ ను తీసుకున్న బుచ్చిబాబు, మిర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మ ను కూడా ఓ పాత్ర కోసం తీసుకున్నారు. జగపతి బాబు కూడా సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. కాగా ఇప్పుడీ సినిమాలో మరో స్టార్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, కన్నడ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న విజి చంద్రశేఖర్.
పెద్ది సినిమాలో విజి చంద్రశేఖర్, రామ్ చరణ్ కు తల్లి పాత్రలో నటించానున్నారని సమాచారం. రీసెంట్ గా విజి చంద్రశేఖర్ తమిళ సూపర్ హిట్ మామన్ లో కనిపించగా, తెలుగులో ఆమె అఖండ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించారు. అఖండ తర్వాత విజికి తెలుగులో మంచి అవకాశాలే వస్తుండగా, ఇప్పుడు పెద్దితో మరో భారీ అవకాశాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.