'పెద్ది' ఆల్ టైమ్ రికార్డ్.. అక్కడ పవన్, ప్రభాస్ రికార్డులు బ్రేక్

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2026-06-04 04:48 GMT

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ పెద్ది అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రీమియర్స్ తోనే కర్ణాటకలో రూ.3.02 కోట్లు వసూళ్లు అందుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ స్టేట్ లో తెలుగు సినిమాల సెక్షన్ లో టాప్ ప్లేస్ ను అందుకుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రలో నటించడం కర్ణాటక మార్కెట్‌ లో సినిమాకు ఎక్స్ ట్రా అసెట్ గా మారిందని చెప్పాలి. అయితే బెంగళూరు సహా రాష్ట్రంలోని పలు మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు టాక్.

కర్ణాటకలో ఇప్పటివరకు ఉన్న తెలుగు చిత్రాల ప్రీమియర్ రికార్డులు పెద్ది బ్రేక్ చేసింది. దీంతో ఆ ఇప్పుడు లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఓజీ రూ.2.72 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, ప్రభాస్ ది రాజా సాబ్ రూ.2.61 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. పుష్ప 2 రూ.2.55 కోట్లు, హరిహర వీరమల్లు రూ.1.47 కోట్ల వసూళ్లతో నెక్స్ట్ ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ లెక్కల ప్రకారం.. పెద్ది తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

పెద్ది- రూ.3.02కోట్లు

ఓజీ- రూ.2.72కోట్లు

రాజాసాబ్- రూ.2.61కోట్లు

పుష్ప 2- రూ.2.55కోట్లు

వీరమల్లు- రూ.1.47కోట్లు

అయితే రామ్ చరణ్‌ కు కర్ణాటకలో ఇప్పటికే స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది.. గత చిత్రాలతో ఏర్పడిన క్రేజ్‌ కు తోడు, పెద్దిలోని మాస్ ఎలిమెంట్స్, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్, ప్రమోషనల్ కంటెంట్ తో పాటు ఈవెంట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగడం కూడా రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ కు ప్రధాన కారణంగా చెప్పాలి.

ఇక చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. శివరాజ్‌ కుమార్‌ తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవికిషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రత్నవేలు చేపట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఆ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన పెద్దికి అన్నిచోట్ల మంచి ఓపెనింగ్స్ నమోదవ్వనున్నట్లు అర్థమవుతోంది.

అయితే ఇప్పుడు కర్ణాటకలో పెద్ది నమోదు చేసిన ప్రీమియర్ రికార్డు మూవీ టీమ్ లో జోష్ నింపింది. తొలిరోజు వసూళ్లతో పాటు వీకెండ్ కలెక్షన్లపై అందరి దృష్టి నిలిచింది. ప్రీమియర్స్ ద్వారానే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ ఫుల్ జర్నీ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, పెద్ది మూవీ కర్ణాటకలో చరణ్ కెరీర్‌ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News