• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త ప్రాజెక్ట్‌ లకు...

కొత్త ప్రాజెక్ట్‌ లకు పవన్‌ డైరీలో ఖాళీ ఉందా...?

| పవన్‌ ప్రస్తుతం మధ్య లో ఉన్న సినిమాలను పూర్తి చేస్తాడేమో.. అంతకు మించి కొత్త ప్రాజెక్ట్‌ ల విషయంలో కనీసం చర్చలు కూడా ఉండక పోవచ్చు.

By - Tupaki Desk
Update: 2024-07-26 04:56 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ పరిపాలనతో నిమగ్నం అయ్యారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అధికారం దక్కడంతో తాను అనుకున్న విధంగా పరిపాలనతో బిజీ బిజీగా ఉంటున్నాడు. పార్టీ కార్యకర్తలకు, సామాన్య జనాలకు సమయం కేటాయించడం తో పాటు, అధికారులతో రివ్యూలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

ఇలాంటి సమయంలో పవన్‌ కళ్యాణ్ ను షూటింగ్‌ కు రమ్మని నిర్మాతలు పిలువలేని పరిస్థితి. పవన్ స్వయంగా కొన్ని రోజుల తర్వాత ఇప్పటికే మొదలు పెట్టిన సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తాను అన్నాడు. ఇప్పుడే షూటింగ్ కు వెళ్తే జనాలు విమర్శిస్తారు అంటూ స్వయంగా పవన్‌ చెప్పుకొచ్చారు.

పవన్‌ ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను మొదలు పెట్టి దాదాపుగా సగం షూటింగ్ ను పూర్తి చేశాడు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమా కూడా కొన్ని రోజుల పాటు షూట్‌ చేశారు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ను ముగించే బాధ్యత పవన్‌ ముందు ఉంది. ఇలాంటి సమయంలో మరో ప్రాజెక్ట్‌ గురించిన చర్చ జరుగుతోంది.

ఓజీ సినిమాను దర్శకుడు సాహో సుజీత్‌ రెండు భాగాలుగా చేయాలని భావిస్తున్నాడట, అందుకోసం కొన్ని ఎక్కువ రోజుల డేట్లను పవన్ నుంచి అడగాలని సుజీత్‌ అండ్‌ టీం భావిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పవన్‌ బిజీకి కొత్త ప్రాజెక్ట్‌ ఎంత వరకు సాధ్యం అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్ షూటింగ్‌ కు హాజరు కావడం దాదాపు అసాధ్యం. అలాంటిది ఓజీ ని రెండు పార్ట్‌ లు గా చేస్తానంటే ఒప్పుకుంటాడా, ముందు చెప్పినట్లు కాకుండా మరికొన్ని ఎక్కువ రోజులు డేట్లు ఇచ్చేందుకు అంగీకరించే అవకాశాలు లేవనే చెప్పాలి.

పవన్‌ ప్రస్తుతం మధ్య లో ఉన్న సినిమాలను పూర్తి చేస్తాడేమో.. అంతకు మించి కొత్త ప్రాజెక్ట్‌ ల విషయంలో కనీసం చర్చలు కూడా ఉండక పోవచ్చు. గతంలోనే తాను డబ్బు కోసం పార్టీని నడపటం కోసం సినిమాలు చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన పరిపాలన పై దృష్టి పెట్టి సినిమాలను పూర్తిగా పక్కకు పెట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Tags:    
  • Pawankalyan 
  • Deputychiefminister 
  • Movies 
  • Ogmovie 
  • Hariharaveeramallu 
  • Ustadbhagatsingh 
  • Sujeet 
  • Harishshankar 
  • Krish 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS