అన్నాదమ్ముళ్ల టార్గెట్ సేమ్.. ఉస్తాద్ కు లైన్ క్లియర్?
ఉస్తాద్ భగత్ సింగ్.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమా.. రిలీజ్ కు సిద్ధమవుతోంది.;
ఉస్తాద్ భగత్ సింగ్.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమా.. రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే వారిద్దరూ కలిసి చేసిన గబ్బర్ సింగ్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో సినిమాపై భారీ హోప్స్ కూడా పెట్టుకున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. రీసెంట్ గా డబ్బింగ్ కూడా మొదలుపెట్టారు. దీంతో మరికొద్ది రోజుల్లో అన్ని పనులు పూర్తి అవ్వనున్నాయి. అయితే ఉస్తాద్.. ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మార్చి 27వ తేదీన విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది, నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి.
కానీ ఆ రెండు సినిమాలు కూడా వాయిదా పడుతున్నట్లు సమాచారం. దీంతో అదే రోజు.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ థియేటర్స్ లో విడుదల అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. అయితే అదే నిజమైతే.. ఉస్తాద్ రిలీజ్ కు వారం ముందు ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఆ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఉస్తాద్ కు కాస్త ఇబ్బంది అని అనుకోవచ్చు.
కానీ పవన్ సినిమా రీజనల్ మార్కెట్ టార్గెట్ తో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. అది కూడా రీజనల్ మూవీ అన్న విషయం తెలిసిందే. దీంతో అన్న సేమ్ టార్గెట్ తో హిట్ కొట్టగా.. తమ్ముడు కూడా కొట్టేలా కనిపిస్తున్నారు.
ఇక ఉస్తాద్ విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. మరోసారి పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయనున్నారు. అయితే ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింప్సెస్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పుడు మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి కారును గిఫ్ట్ ఇవ్వగా.. ఆ కారు వేసుకొస్తే ఉస్తాద్ లోని కొత్త పాటను ప్లే చేసుకుంటూ డ్రైవ్ కు వెళ్దామని హరీష్ ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పెడుతూ.. మరో సాంగ్ రానుందని చెప్పారు. ఏదేమైనా ఉస్తాద్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.