రీ-రిలీజ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ పంజా.. ఎప్పుడంటే?

గత రెండు మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ చిత్రాల హవా ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2026-05-24 09:58 GMT

గత రెండు మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ చిత్రాల హవా ఏ రేంజిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఒకరిని మించి మరొకరు.. అభిమానులు కూడా తమ అభిమాన హీరోల సినిమాలను మళ్లీమళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు.. పైగా 4k వెర్షన్ లో రిలీజ్ చేస్తూ నేటి ఆధునికతకు తగ్గట్టుగా థియేటర్లలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూడా రీ రిలీజ్ కి సిద్ధమయింది. మరి ఆ చిత్రం ఏంటి ? ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పంజా. ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్గా రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో అభిమానుల కోలాహాల మధ్య రీ రిలీజ్ స్పెషల్ పోస్టర్ అధికారికంగా ఆవిష్కరించారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్, యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మేకింగ్ పరంగా కూడా ఈ సినిమా అభిమానులలో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలోనే కాకుండా ఇటు రాజకీయాలలో కూడా చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులలో ఇటు రాజకీయాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి . మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమిలో భాగంగా పోటీ చేసి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇలా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా చేసి పరవాలేదు అనిపించుకున్న ఈయన.. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ఇక అందులో భాగంగానే ఆయన నటించిన చిత్రాలను ఇప్పుడు అభిమానులు రీ రిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News