వీడియో : ఓజీ సెలబ్రేషన్‌లో తమన్ తల్లి
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందుతున్న 'ఓజీ' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.;
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందుతున్న 'ఓజీ' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచే విధంగా ఇటీవల విడుదలైన ఫైర్ స్ట్రామ్ వీడియో ఉంది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అచ్చు అలాగే దర్శకుడు సుజీత్ చూపించబోతున్నాడు అని ఆ విజువల్స్ చూస్తే అర్థం అయింది. అంతే కాకుండా పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎంజాయ్‌మెంట్ రెట్టింపు చేసే విధంగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండబోతుందని ఆ వీడియోలోని బీజీఎంను వింటే అనిపిస్తుంది. పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి స్పందన దక్కింది.
ఓజీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఓజీ ఫైర్ స్ట్రామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి మంచి స్పందన రావడంతో సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పూణకాలు వచ్చినట్లుగా థమన్ సంగీతాన్ని ఇస్తాడు కదా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఓజీకి పాజిటివ్ స్పందన రావడంలో ఖచ్చితంగా థమన్ సంగీతం ముఖ్య పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. గతంలో వచ్చిన ఒక చిన్న గ్లిమ్స్ కోసం కూడా థమన్ అప్పుడు అద్భుతమైన మ్యూజిక్‌ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని అభిమానులు అంటున్నారు. సినిమాలో ఫుల్ ప్యాక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండవచ్చు అని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఓజీ మ్యూజిక్ కి మంచి స్పందన రావడంతో తమన్ సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకున్నాడు.
థమన్ తల్లి కేక్ కట్టింగ్
తమన్ ఓజీ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ఆయన తల్లి బాగా ఇంప్రెస్ అయిందట. ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మరో ఫ్యాన్ అంటూ తమన్ యొక్క తల్లిగారు కేక్ కట్ చేస్తున్న వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా షేర్ చేయడం జరిగింది. ఓజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో ఆమె ఈ కేక్ ను కట్ చేయడం జరిగింది. తమన్ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ను ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని మాత్రం ఇలా చాలా స్పెషల్‌గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మామూలుగా అందరికీ తెగ హై ఇస్తుంది. అలాంటిది థమన్‌కి వర్క్ చేసేప్పుడు అంతకు మించి అన్నట్లుగా హై ఇచ్చి ఉంటుంది, అందుకే ఈ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కుమ్మేశాడు అంటూ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఓజీ ప్రమోషన్స్ షురూ
హరిహర వీరమల్లు సినిమా నిరాశ పరచినా కూడా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఓజీ సినిమా కోసం చూస్తున్నారు. గత నెలలోనే షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ డబ్బింగ్ సైతం చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తి బాధ్యత దర్శకుడు సాహో సుజీత్, సంగీత దర్శకుడు తమన్ లు భుజాల పై వేసుకుని ఓజీని మోసుకు వెళ్తున్నారు. వచ్చే నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలో నటించాడు. అంతే కాకుండా శ్రియా రెడ్డి సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. సినిమా దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ స్థాయిలో ఓజీ రాబట్టేనా చూడాలంటే వచ్చే నెల వరకు వెయిట్ చేయాల్సిందే.