పవన్ వయసుని తగ్గించనున్న సుజిత్!

వీఏఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ తో పాటు ఎఐ ద్వారా యంగ్ పవన్‌ కల్యాణ్‌ను తెరపై చూపించాలనేది మేకర్స్ ప్లాన్.;

Update: 2025-04-18 14:25 GMT

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ లైనప్ లో ఉన్న సినిమాల్లో ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా ‘ఓజీ’ సినిమా పైనే ఉంది. ఫ్యాన్స్ కు కావాల్సిన హై వోల్టేజ్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని అర్ధమవుతుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే గ్లింప్స్‌ విడుదలయ్యాక హైప్ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ పాత పవన్‌ను తెరపై చూపించేందుకు దర్శకుడు సుజీత్‌ ఊహించని ప్రయోగానికి పూనుకున్నట్టు టాక్.

ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మాట… ‘ఓజీ’ సినిమాలో 30 ఏళ్ల వయసున్న పవన్‌ కల్యాణ్‌ను తిరిగి తెరపై చూపించేందుకు సుజీత్ ఒక స్పెషల్ ఐడియాతో వస్తున్నాడట. 50 ఏళ్లు దాటిన పవన్‌కు మరోసారి యంగ్ లుక్‌ ఇవ్వాలని డిసైడ్ అయి, AI (కృత్రిమ మేధస్సు) సాయంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా బాలీవుడ్‌లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ, తెలుగులో మాత్రం ఇది తొలిసారి.

వీఏఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ తో పాటు ఎఐ ద్వారా యంగ్ పవన్‌ కల్యాణ్‌ను తెరపై చూపించాలనేది మేకర్స్ ప్లాన్. ఈ అంశాన్ని స్పెషల్‌గా హైలైట్ చేసే సీన్స్‌ కూడా స్క్రిప్ట్‌లో ఇప్పటికే డిజైన్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా మాస్‌ అవతార్‌లో ఉన్న ఓ ఫైట్‌ సీన్‌ను ఎఐ లుక్‌తో రూపొందించనున్నట్టు అంటున్నారు. ఈ ఐడియా పని చేస్తే, అది సినిమాకు హైపే కాదు.. థియేటర్లలో పాత పవన్‌ మళ్లీ ప్రత్యక్షమవుతాడన్న నమ్మకాన్ని ఇచ్చేలా మారుతుంది.

గతంలో 'తమ్ముడు', 'ఖుషి', 'బద్రి' లాంటి సినిమాల్లో పవన్‌ ఎలా ఉండేవారో… అలాంటి లుక్‌ను మరోసారి తెరపై చూడటానికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సుజీత్ ఆ కోణంలో అడుగు పెట్టడం పక్కా సంచలనం. టెక్నికల్ టీమ్ కూడా హాలీవుడ్ స్థాయిలో పని చేస్తోందట. ఇకపోతే ఓజీ సినిమాకు సంభందించిన మిగతా పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. సుజీత్‌తో పాటు థమన్‌ మ్యూజిక్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.

ప్రస్తుతం నిర్మాతలు సెట్ వర్క్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. మిగతా షూట్ పూర్తయ్యాక, మరో టీజర్‌కు సంబంధించి ఓ మాస్‌ అప్డేట్ ఇచ్చేందుకు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఉన్న అంచనాల మధ్య… ఏఐ తో పవన్‌ లుక్‌ మరోసారి తెరపై మెరిసే అవకాశం ఉంటే, అది ఈ సినిమాకు బంపర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓజీ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తే, పార్ట్ 2కి కూడా అదే మాస్ యంగ్ లుక్‌ను రిపీట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సుజీత్ తీసుకున్న ఈ డెసిషన్‌కు ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News