రికార్డులు సృష్టిస్తున్న ఓజీ ఫస్ట్ లిరికల్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా ఓజి. సరైన సినిమా పడాలే కానీ బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా ఏంటో అర్థమవుతుందని తన తాజా చిత్రం ఓజి అర్థమయ్యేలా చేస్తోంది.;
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా ఓజి. సరైన సినిమా పడాలే కానీ బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా ఏంటో అర్థమవుతుందని తన తాజా చిత్రం ఓజి అర్థమయ్యేలా చేస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఓజిపై మంచి హైప్ క్రియేట్ అవగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది.
ఓజి ఫస్ట్ సాంగ్ కు రికార్డు లైక్స్
దసరా స్పెషల్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సాంగ్ గా ఫైర్ స్టార్మ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్ పవన్ ఫ్యాన్స్ లో మంచి జోష్ ను నింపింది. అంతేకాదు, టాలీవుడ్ లోనే ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ లైక్స్ అందుకున్న సాంగ్ గా ఫైర్ స్టార్మ్ రికార్డుకెక్కింది.
ఫ్యాన్స్ కు పూనకాలు
24 గంటలు పూర్తి కాకుండానే ఈ సినిమా రికార్డు స్థాయిలో లైక్స్ దక్కించుకుందంటే ఈ లెక్కన సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓజి సినిమాలో పవన్ ఓజాస్ గంభీర పాత్రను ఎలివేట్ చేసే సాంగ్ గా ఇది థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించనుంది.
బెల్ బాటప్ ప్యాంట్ లో పవన్ వాకింగ్ స్టైల్, ఆయన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్, గన్ ఫైరింగ్ ఇవన్నీ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది. లిరికల్ వీడియోలో కొన్ని షాట్స్ లో సుజిత్ చూపించిన ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా బావున్నాయి. పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది.