పవన్ కళ్యాణ్ గొప్ప సాహిత్య పండితుడిగా!
ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అతి దగ్గరగా చూసిన నటి నిధి అగర్వాల్ ఆయన గురించి మరిన్ని విషయాలు పంచుకుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుస్తక పఠనం గురించి చెప్పాల్సిన పనిలేదు. పుస్తకాలంటే పిచ్చి . వాటి ద్వారా జ్ఞానం సంపాదించడం అంటే ఆపారమైన ఆసక్తి. ఇప్పటికే రెండు లక్షల పుస్తకాలు చదవడం పూర్తి చేసారు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలకే సమయం కేటాయిస్తుంటారు. చదవాల్సిన వయసులో సరిగ్గా చదువు కోలేకపోయినా? ఇప్పుడు మాత్రం చదవడంపై ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు చాలా సందర్భాల్లో రివీల్ చేసారు. బయట దేశాలకు వెళ్తోన్న సమయంలో కూడా పవన్ చేతుల్లో పుస్తకాలు కనిపిస్తుంటాయి.
ప్లైట్ జర్నీలోనూ పుస్తక పఠనంలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అతి దగ్గరగా చూసిన నటి నిధి అగర్వాల్ ఆయన గురించి మరిన్ని విషయాలు పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే... పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన సాహిత్యాభిరుచి నాకోంతో స్పూర్తిని నింపింది. ఎప్పుడు చూసినా తెలుగు పుస్తకాలతోనే కనిపించేవారు. సాహిత్యంపై ఆయనకున్న పరిజ్ఞానం అంతా ఇంతా కాదు. షాట్ గ్యాప్ లో పుస్తకంతో కనిపించేవారు. షాట్ అయిన వెంటనే వెళ్లి కూర్చుని చదువుకునేవారు.
ఆయన్ని చూసి నాకు కూడా పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావి స్తున్నా. కోట్లాది మంది అభిమానించే పెద్ద స్టార్. ఆయన తో సినిమా అంటే వంద సినిమాలతో సినిమా. కానీ ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతారని ఆయన సెట్స్ లో ఉన్న ప్పుడే అర్దమైంది` అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా `హరిహరవవీరమల్లు` చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించిన ప్రచారం పనులు మొదలయ్యా యి. ఈ నేపథ్యంలోనే నిధి అగర్వాల్ ఆన్ సెట్స్ అనుభవాలను పంచుకునే క్రమంలో పవన్ గురించిన వ్యక్తిగత విషయాలు ఇలా షేర్ చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్య తలు చూసుకుంటోన్న సంగతి తెలిసిందే.