• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హ్యాట్రిక్ ఫ్లాప్స్.....

హ్యాట్రిక్ ఫ్లాప్స్.. సైలెంట్ అయిపోయిన మెగా హీరో?

| మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు

By - Tupaki Desk
Update: 2024-07-26 02:30 GMT

మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా, సాయి ధరమ్ తేజ్ తమ్ముడుగా 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. డెబ్యూతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు, 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఒక్కసారిగా వైష్ణవ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ అతనితో సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరిచాయి. దీంతో మెగా మేనల్లుడు అనతి కాలంలోనే నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటారని అందరూ భావించారు. కానీ ఏదీ అనుకున్న విధంగా జరగలేదు.

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'కొండపొలం' అనే అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో నటించారు వైష్ణవ్ తేజ్. 'హరి హర వీరమల్లు' లేట్ అవడంతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఆ గ్యాప్ లో ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో 'రంగ రంగ వైభవంగా' అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించారు. తమిళ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమా తీసిన గిరీశయ్య దీనికి దర్శకుడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా తీవ్ర నిరాశ పరిచింది.

ఈసారి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'ఆదికేశవ' అనే సినిమాతో మాస్ హీరో అనిపించుకునే ప్రయత్నం చేశారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ మూవీ డిజాస్టర్ గా మారింది. ఇలా యంగ్ హీరోకి బ్యాక్ టూ బ్యాక్ మూడు ఫెయిల్యూర్స్ పలకరించాయి. ఒక బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వైష్ణ‌వ్ తేజ్ మాత్రం ఇంతవరకూ తన త‌దుప‌రి సినిమాని ప్రకటించలేదు.

ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నారు. కానీ వైష్ణ‌వ్ తేజ్ మాత్రం సైలెంట్ అయిపోయారు. 'ఆదికేశవ' వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి దాకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు.

అయితే వైష్ణ‌వ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడమే ఈ ఆలస్యానికి కారణమనే మాట వినిపిస్తోంది. హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడటంతో కాస్త లేట్ అయినా సరే, ఈసారి వచ్చే చిత్రంతో కచ్ఛితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారని అంటున్నారు. కొన్ని పెద్ద బ్యానర్లలో అతను వర్క్ చేయటానికి కమిట్ అయ్యారు. ఇప్పటికే కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. కథ నచ్చితే త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మ

Tags:    
  • Panjavaishnavtej 
  • Vaishnavtej 
  • Uppena 
  • Kondapolam 
  • Adikeshava 
  • Vaishnavtejmovies 
  • Tollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS