మాలీవుడ్ కామెడీ మూవీ తెలుగు వెర్షన్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు చాలా వరకు స్పెషల్ గానే ఉంటాయి.;
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలు చాలా వరకు స్పెషల్ గానే ఉంటాయి. అక్కడ డైరెక్టర్స్ వర్క్ కు అన్ని భాషల్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. రీసెంట్ గా సందీప్ ప్రదీప్, సూరజ్, షరఫుద్దీన్ లీడ్ రోల్స్ మను స్వరాజ్ పడక్కలమ్ మూవీని తెరకెక్కించారు. సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ జోనర్ లో మూవీని రూపొందించారు.
గత నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో టాలీవుడ్ మూవీ లవర్స్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో రివ్యూస్ చేస్తున్నారు. మరి పడక్కలమ్ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
స్టోరీ లైన్ ఇదే.. ఇద్దరు ప్రొఫెసర్స్, నలుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చుట్టూ పడక్కలమ్ అంతా తిరుగుతుంది. ప్రొఫెసర్ షాజీ (సూరజ్) విద్యార్థుల డిమాండ్ మేరకు హెచ్ ఓడీ గా మారుతాడు. కానీ అది మరో ప్రొఫెసర్ రంజిత్ (షరఫుద్దీన్)కు ఇష్టం ఉండదు. దీంతో పపర్ పవర్స్‌తో కాలేజీలో అందరి ముందు షాజీని నెగెటివ్ గా చూపిస్తాడు.
అప్పుడు స్టూడెంట్స్ ఆ సీక్రెట్
తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడే రంజిత్ బ్యాగ్ లో ఓ పాత బాక్స్ కనిపెడతారు. కానీ ఓపెన్ చేయలేరు. అప్పుడు పవర్స్ గురించి తెలుసుకోవాలనుకున్న గ్యాంగ్ కు వింత అనుభవం, సమస్యలు వస్తాయి. మరి చివరకు ఏం జరిగింది? రంజిత్ దగ్గర ఉన్న బాక్స్ సీక్రెట్ ఏంటి? అనేది పూర్తి సినిమా.
అయితే పడక్కలమ్ మూవీ ఆడియన్స్ ను ఫుల్ నవ్విస్తూ.. థ్రిల్ చేస్తుందని సినీ ప్రియులు చెబుతున్నారు. బాక్స్ విషయం ఇంట్రస్టింగ్ గా ఉంటుందని.. స్టూడెంట్స్ గ్యాంగ్ ఫుల్ కామెడీ పండిస్తారని కామెంట్లు పడుతున్నారు. సీక్రెట్ కోసం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు మెప్పిస్తాయని నెట్టింట రివ్యూస్ ఇస్తున్నారు.
లాజిక్స్ కోసం కాకుండా ఫన్ కోసం సినిమా చూడాలని చెబుతున్నారు. క్లైమాక్స్ రొటీన్ కు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సీన్స్ హర్ట్ టచింగ్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ ఎక్కువ లేకుండా సింపుల్ గా బాగుందని.. ఎలాంటి అసభ్యకర కంటెంట్ లేదని.. ఫ్యామిలీతో చూసే మూవీ అని చెబుతున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ అంతా బాగా నటించారని.. మను స్వరాజ్ తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు.