సెప్టెంబర్ మొదటివారం.. ఓటీటీలలో ఎంటర్టైన్ చేయనున్న చిత్రాలు ఇవే!

ఓటీటీ ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్ మొదటి వారం సరికొత్త సినిమాలతో, సిరీస్‌లతో సందడి చేయడానికి సిద్ధమైంది.

Update: 2026-08-31 09:48 GMT

ఓటీటీ ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్ మొదటి వారం సరికొత్త సినిమాలతో, సిరీస్‌లతో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ, ఇంటి పట్టునే ఉండి డిఫరెంట్ జోనర్లను ఆస్వాదించే వారి కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌ను ముందుకు తెస్తున్నాయి. తెలుగు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు ఇతర భాషల సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలు ఈ వారం మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వస్తున్నాయి మరి అవేంటో చూసేద్దాం ..

నెట్‌ఫ్లిక్స్‌లో వినోదాల జాతర – ధమాల్ 4, కొరియన్ కనకరాజు:

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ తన వినియోగదారుల కోసం భారీ లైనప్‌ను సిద్ధం చేసింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో పాటు సస్పెన్స్ డ్రామా ‘గాంధారి’ డబ్బింగ్ మూవీలు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రాబోతున్నాయి. ఇక వీటితో పాటు హిందీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ధమాల్ 4’ సెప్టెంబర్ 4న డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఇంగ్లీష్ సిరీస్‌లలో ‘ద జెంటిల్‌మెన్ సీజన్ 2’, రియాలిటీ షో ‘1000 ఎల్‌బీ సీజన్ 9’ మరియు పలు ఆసక్తికర డాక్యుమెంటరీలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ & హాట్‌స్టార్‌లో స్పెషల్ కంటెంట్:

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు మ్యూజికల్ డ్రామా సిరీస్ ‘జగమే సంగీతం’ సెప్టెంబరు 04 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మంచి బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సిరీస్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి ‘ద కోర్ట్’ అనే కోర్టురూమ్ డ్రామా తెలుగు డబ్బింగ్ వర్షన్ సెప్టెంబరు 04న అడుగుపెడుతోంది. డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాట్స్‌తో ఈ రెండు ప్రాజెక్టులు ఓటీటీ లవర్స్‌కు మంచి ఆప్షన్‌గా మారనున్నాయి.

సన్ నెక్స్ట్, సోనీ లివ్ లైనప్ – డిసి, ఉన్మాదం:

సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డిసి’ తెలుగు డబ్బింగ్ వర్షన్ సెప్టెంబర్ 04న రిలీజ్ కాబోతోంది. ఇక సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ విషయానికొస్తే, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ‘ఉన్మాదం’ తెలుగు డబ్బింగ్ చిత్రం సెప్టెంబర్ 04న మరియు ప్రసిద్ధ హిందీ క్రైమ్ డ్రామా ‘క్రైమ్ పాట్రోల్’ సరికొత్త ఎపిసోడ్లు ఆగస్టు 31 నుంచే అందుబాటులోకి రానున్నాయి.

ఆపిల్ టీవీ ప్లస్‌లో 'మే డే' హంగామా: అంతర్జాతీయ కంటెంట్ ప్రియుల కోసం ఆపిల్ టీవీ ప్లస్ ప్లాట్‌ఫామ్ వేదికగా 'మే డే' అనే క్రేజీ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ 04న విడుదలవుతోంది. ఇక హాలీవుడ్ యాక్షన్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు.

ఇంటి వద్దే ఉంటూ ప్రశాంతంగా వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సెప్టెంబర్ మొదటి వారం ఓటీటీ రిలీజ్‌లు మంచి ఛాయిస్‌గా మారబోతున్నాయి. ఇక కామెడీ, క్రైమ్, డ్రామా, యాక్షన్ ఇలా ప్రతి జోనర్‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా నచ్చిన ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త చిత్రాలను చూసి ఎంజాయ్ చేయండి.

Tags:    

Similar News