• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓం భీమ్ బుష్.. రెండు...

ఓం భీమ్ బుష్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?

| గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన కుర్ర హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-03-24 05:45 GMT

ఓం భీమ్ బుష్.. అంటూ మంత్రం వేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ! మార్చి 22వ తేదీన రిలీజైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన కుర్ర హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

గతంలో బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ సినీ ప్రియులను నవ్వించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్.. ఇప్పుడు ఓం భీమ్ బుష్ తో మరోసారి కడుపుబ్బా నవ్వించారు. తమ కామిక్ టైమింగ్ తో అదరగొట్టారు. సినిమాలో సంపంగి మహల్ లో వీరు ముగ్గురు చేసిన కామెడీ వేరే లెవల్ అని చెప్పవచ్చు. రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియట్ చేసుకున్నట్లే.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా.. రెండు రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.10.44 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే కన్నా రెండో రోజు అధిక వసూళ్లు నమోదు చేసింది. తొలి రోజు రూ.4.6 కోట్లు రాబట్టగా.. రెండో రోజు రూ.5.84 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా.. క్వార్టర్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేసింది. ఇప్పటి వరకు 260K+ వసూళ్లు రాబట్టి యూఎస్ లో కూడా దూసుకుపోతోంది.

అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించారు. భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్‌, అత్యున్నత సాంకేతికతతో రూపొందించడం వల్ల ఈ మూవీ బడ్జెట్ రూ.25 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 800 స్క్రీన్లకు పైగా, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లతో కలిపి వరల్డ్ వైడ్ గా ఈ మూవీని 1300 కుపైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు మేకర్స్.

మొత్తానికి ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్, హోలీ హాలీడే కలిసి రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, ప్రియ వడ్లమానితో పాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇతర ఏ సినిమాలు లేకపోవడంతో వేగంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Ombheembush 
  • Sreevishnu 
  • Priyadarshi 
  • Rahulramakrishna 
  • Ombheembushcollections 
  • Sreeharshakonuganti 
  • Tollywood 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS