• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG కోసం మరో ఏడాది...

OG కోసం మరో ఏడాది ఆగాల్సిందేనా..?

| ఇప్పుడప్పుడే పవన్ మళ్లీ మేకప్ వేసుకుని సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఓజీ సినిమా రిలీజ్ ఆశలపై నీళ్లు చల్లినట్టే అని అనుకుంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-01-20 15:30 GMT

ఏపీలో ఎలక్షన్స్ అయ్యేంతవరకు పవన్ కళ్యాణ్ బిజీ అన్నది తెలిసిందే. జనసేన అధినేతగా రానున్న ఏపీ ఎలక్షన్స్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ క్రమంలో తన సినిమాల షెడ్యూల్ అన్నిటినీ పక్కన పెట్టేశాడు. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచే పవన్ పూర్తిగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అయితే సెట్స్ మీద ఉన్న పవన్ సినిమాల పరిస్థితి ఏంటని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తితో ఉన్నారు.

క్రిష్ తో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా ముందుకు సాగట్లేదు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచినా సినిమా షూటింగ్ అవాంతరాలు ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలను కూడా పోగొట్టేలా చేశాయి. ఇక మరోపక్క సాహో సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

పవన్ నుంచి రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా OG సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఆమధ్య వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ హైప్ వచ్చేలా చేసింది. థమన్ మ్యూజిక్, సుజిత్ టేకింగ్, పవన్ యాక్షన్ OG వారెవా అనేలా చేస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఆడియన్స్ లో ఎగ్జైటింగ్ ఉంది. అసలైతే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేయొచ్చు. కానీ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సింది ఉంది. ఇప్పుడప్పుడే పవన్ మళ్లీ మేకప్ వేసుకుని సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఓజీ సినిమా రిలీజ్ ఆశలపై నీళ్లు చల్లినట్టే అని అనుకుంటున్నారు.

పవన్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో అయినా షూటింగ్ చేస్తే OGని నెక్స్ట్ సంక్రాంతికి తెచ్చే అవకాశం ఉంటుంది. అలా కుదరకపోతే మాత్రం సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఈసారి నేషనల్ వైడ్ గా తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. సుజిత్ సాహో కమర్షియల్ గా ఎలా ఉన్నా ఫ్యాన్స్ ని మెప్పించింది. మరి ఓజీ విషయంలో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Movie 
  • Og 
  • Ogmovie 
  • Pawankalyan 
  • Sujeeth 
  • Dvv 
  • Shooting 
  • Politics 
  • Releasedate 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS