• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG గ్లింప్స్.. చిరుతలా...

OG గ్లింప్స్.. చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత

| ముందుగా చెప్పినట్టుగానే ఇందులో పవన్ లుక్స్​, వైలైన్స్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్.. ​ అస్సలు ఊహించని రేంజ్​లో ఎంతో పవర్​ఫుల్​గా ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2023-09-02 05:43 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ పుట్టినరోజు సందర్భంగా.. అదిరిపోయే ట్రీట్​ ఇచ్చేశారు ఓజీ(ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​) మేకర్స్​. అభిమానులకు పూనకాలు వచ్చే రేంజ్​లో 'హంగ్రీ చీతా' గ్లింప్స్​ను రిలీజ్​ చేసి సోషల్​మీడియాను షేక్ చేసేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఇందులో పవన్ లుక్స్​, వైలైన్స్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్.. ​ అస్సలు ఊహించని రేంజ్​లో ఎంతో పవర్​ఫుల్​గా ఉన్నాయి.

'ఆకలితో ఉన్న పులి వస్తున్నట్లు' మేకర్స్​ చెప్పినట్టుగా పులి.. జింకలను వేటాడినట్టుగా పవన్​ శత్రువలను ఊచకోత కోస్తూ కనిపించారు. మైండ్​ బ్లోయింగ్​ పెర్​ఫార్మెన్స్​తో అదరగొట్టేశారు. ఆయన లుక్స్​, చీతా లాంటి కళ్లు, ఒక్కోకరిని నరుక్కుంటూ పోతుంటే గ్లింప్స్​ మొత్తం షేకే అయిపోయినట్టు అనిపించింది. మొత్తంగా ఇప్పుటి వరకు చూడని పవన్ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు.

"పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. ఇట్​ వజ్​ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్​.. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా సైతాన్​" అంటూ పవన్​ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్​ అదిరిపోయాయి. చివర్లో ఫైర్​ స్టార్మ్​ ఈజ్ కమింగ్​ అంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు. తమన్​ అందించిన సంగీతం నిజంగానే బ్సాస్ట్ అయ్యే రేంజ్​లో ఉన్నాయి.

మొత్తంగా ఈ గ్లింప్స్.. యూట్యూబ్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. ఇక దీంతో సినిమాపై ఫ్యాన్స్​లో అంచనాలు మరింత పెరిగిపోవడం పక్కా అనిపిస్తోంది. అభిమానులకు ఇక పూనకాలు వచ్చేస్తాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది.

సినిమాను​ ఆర్​ఆర్​ఆర్​ నిర్మాత దానయ్య.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Full View
Tags:    
  • Tollywood 
  • Pawankalyan 
  • Ogmovie 
  • Sujeeth 
  • Dvv 
  • priyankamohan 
  • Glimpse 
  • Birthday 
  • Powerstar 
  • Gangstermovie 
  • Firestorm 
  • Powerstorm 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS